Cognizant Off Campus Drive: ఏడాదికి రూ. 4 లక్షల వరకూ జీతం.. డిగ్రీ, బీటెక్‌ పాసైన వాళ్లకు సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌.. రిజిస్ట్రేషన్‌ లింక్‌ ఇదే

Cognizant Off campus Drive 2022:డిగ్రీ, బీటెక్‌ పూర్తి చేసిన వారికి ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ గుడ్‌ న్యూస్ చెప్పింది. భారీగా ఖాళీలను భర్తీ చేసేందుకుగాను ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఈ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌లో భాగంగా ఐటీ ప్రొగ్రామర్‌ అనలిస్ట్‌ ట్రెయినీ/ ఐటీ ప్రోగ్రామర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం:

ఈ డ్రైవ్‌లో పాల్గొనే అభ్యర్థులు బీఈ/ బీటెక్‌/ ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్‌ను 2020/ 2021/ 2022 ఏడాదిలో పూర్తి చేసిన వారు మాత్రమే ఇందుకు అర్హులు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులను ప్రాథమిక స్క్రీనింగ్‌, టెక్నికల్‌/ ఎస్‌ఎంఈ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

నాలుగేళ్ల డిగ్రీ/ పీజీ పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ. 4 లక్షలు, మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ. 2.52 లక్షలు జీతంగా అందిస్తారు.

దరఖాస్తుల స్వీకరణకు జులై 24 చివరితేది.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం క్రింది వాట్స్ అప్ గ్రూప్ లో చేరండి....


Registration Link
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top