SSC Delhi Police Head Constable Recruitment 2022: దేశ రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (SSC Head Constable) (AWO/ TPO) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 857 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లోని అర్హతలున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జులై 29 దరఖాస్తులకు చివరితేది.అమెజాన్ బిగ్ బ్రాండ్ డేస్ | బ్యాగ్స్, సూట్‌కేసులు ఇంకా మరెన్నో వాటిపై 70% వరకు తగ్గింపు
SSC Delhi Police Head Constable Recruitment 2022: దేశ రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (SSC Head Constable) (AWO/ TPO) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 857 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లోని అర్హతలున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జులై 29 దరఖాస్తులకు చివరితేది.
SSC Delhi Police Constable Driver: 10వ తరగతి పాసైన వాళ్లకు.. 1411 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రూ.69,100 వరకూ జీతం
SSC Delhi Police Head Constable మొత్తం ఖాళీలు: 857
హెడ్ కానిస్టేబుల్(ఏడబ్ల్యూవో/టీపీవో)- పురుషులు: 573
హెడ్ కానిస్టేబుల్(ఏడబ్ల్యూవో/టీపీవో)- మహిళలు: 284
అర్హత: 10+2(సీనియర్ సెకండరీ) సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో లేదా మెకానిక్-కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేషన్స్‌లో ప్రావీణ్యం ఉండాలి.
వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: పే లెవల్- 4 (రూ.25,500-81,100)
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక దారుఢ్యం, కొలత పరీక్షలు, ట్రేడ్ టెస్ట్, ఇంగ్లిష్ వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్, బేసిక్ కంప్యూటర్ ఫంక్షన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్: ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు గాను 100 ప్రశ్నలుంటాయి. జనరల్ అవేర్‌నెస్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్ బ్రౌజర్‌లు తదితర అంశాల్లో ప్రశ్నలుంటాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
SSC Delhi Police Head Constable ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభతేది: జులై 08, 2022
దరఖాస్తులకు చివరితేది: జులై 29, 2022
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేది: జులై 30, 2022
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేది: 2022 అక్టోబర్‌లో ఉంటాయి
జాబ్ నోటిఫికేషన్ వాట్సాప్ గ్రూప్ లో చేరండి
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in/
0 comments:
Post a Comment