Job Mela: ఏపీలో మరో మెగా జాబ్ మేళా.. వేయికి పైగా జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా అపోలో ఫార్మసీ, Foxlink, Greentech Industries Pvt.Ltd తదితర సంస్థల్లో మొత్తం 1102 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ మేళాను అన్నమయ్య జిల్లాలో నిర్వహించనున్నారు.

Apollo Pharmacy: ఈ సంస్థలో 102 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్, ట్రైనర్, హెచ్ఆర్ రిక్రూటర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. M/B/D.ఫార్మసీ, ఇంటర్, డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ, ఎంహెచ్ఆర్ఎం చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి.

Foxlink: ఈ సంస్థలో 500 ఖాళీలు ఉన్నాయి. ట్రైనీ ఆపరేటర్, జూనియర్ ఇంజనీర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, బీటెక్ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.17 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు రేణిగుంటలో పని చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

Greentech Industries Pvt.Ltd: ఈ సంస్థలో ట్రైనీ ఆపరేటర్ విభాగంలో 500 ఖాళీలు ఉన్నాయి. టెన్త్/ఇంటర్/ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది
ఇతర వివరాలు:- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 22న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.- ఇంటర్వ్యూలను నిర్వహించే చిరునామా: ఎంపీడీఓ ఆఫీస్, పెనమలూరు మండలం, రైల్వే కోడూరు నియోజకవర్గం, అన్నమయ్య జిల్లా.- అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల సర్టిఫికేట్లు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9603770097 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం క్రింది వాట్స్ అప్ గ్రూప్ లో చేరండి....

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top