AP Anganawadi Recruitment 2021 | అనంతపురం అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | 340 పోస్టులు

అనంతపురం జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ప్రత్యేక ప్రకటనను వెలువరించారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.....

అంగన్వాడి నియామకం కొరకు తేది నుండి 16.12.2021 సాయంత్రం 5-00 గంటలలోపు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.

• అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడ్డి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును. అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం స్థానికులు అయి ఉండవలెను.

01.07.2021 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను. SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు. అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST హాబిటేషన్స్ నందు ఉండు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు. • దరఖాస్తుదారు విధవరాలు అయితే 5 మార్కులు, అలాగే విధవరాలు అయివుండి సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే మరోక 5 మార్కులు మొత్తం 10 మార్కులు 18 అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల లకు ప్రభుత్వ నియమ నిబంధనలు మరియు G.O.MS.NO.13 WCD&SC (PROGS) తేది 26/06/19 ప్రకారం గౌరవవేతనం చెల్లించబడును. నెలకు అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ.11500/- మిని అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం రూ:7000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ.7000/- చెల్లించబడును.

రూల్ఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు.నందు ఉంచబడును.

* అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది. పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబంధిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును.

అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే, తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి. స్క్రూటినీ సమయములో CDPO లకు అవకాశం లేకుండా వారిపై చేసుకోవాలి. అభ్యర్థులు CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావలెను. కులము, వివాస పత్రములు సంబంధిత తహసీల్దారు వారిచే జారీచేయబడిన

పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవీకరణ చేసినవి జతపరచవలయును. దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి. ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.

For Latest Updates Join Whatsapp and Telegram Groups:

Join Whatsapp Group: Click Here

Join Telegram GroupClick Here
గమనిక
1) ఖాళీల వివరాల కొరకు సంబంధిత సిడిపివో కార్యాలయంలో సంప్రదించవలెను. ఖాళీల విషయంలో మార్పులు, చేర్పులు ఉండవచ్చును.

2) మరిన్ని వివరాల కొరకు సంబంధిత సిడిపివో కార్యాలయం లేదా అనతపురము జిల్లా అధికారిక వెబ్సైటు https://ananthapuramu.ap.gov.in నందు చూసుకోగలరు. 

3) పిల్లల భద్రత దృష్ట్యా, మినీ అంగన్వాడీ వర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిజర్వేషన్ల నియమ నిబంధనలు పూర్తిగా మినహాయించబడినది. ఎందుకంటే అక్కడ ఒకే వ్యక్తి ఉంటారు కావున పిల్లలను చూసుకోవడం, వంట చేయడం మరియు వడ్డించడంతో పాటు గృహ సందర్శన చేయడం వంటి పనులు చేయాల్సిన అవసరం ఉంది. అంగన్ వాడీ వర్కర్లు మరియు హెల్పర్లకు సంబంధించి, 6వ (అంధత్వం మరియు తక్కువదృష్టి), 31వ (చెవిటి మరియు వినికిడి లోపం) మరియు 86వ (ఆటిజం, మేధో వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక వైకల్యం, బహుళ వైకల్యాలు) రోస్టర్ పాయింట్ నందు రిజర్వేషన్లు మినహాయించబడ్డాయి. పిల్లల భద్రత మరియు శ్రేయస్సు దృష్ట్యా ఈ రోస్టర్ కొరకు మైనర్ లోకోమోటార్ వైకల్యం కలిగి ఉండి గృహ సందర్శన చేయగల సామర్థ్యానికి అడ్డురాని వైకల్యం ఉన్న మహిళలకు అవకాశం ఇవ్వబడుతుంది.

• మరియు అన్ని వివరములు జిల్లా వెబ్ సైట్ https://ananthapuramu.ap.gov.in ను సంప్రదించగలరు మరియు పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత సిడిపివో కార్యాలయము నందు సమర్పించవలెను.

• పోస్టులు ఖాళీల వివరములు ఈ దిగువన ఇవ్వబడినవి. ఏ సమయములో నైనా . పోస్టుల సంఖ్య తగ్గించు అధికారము, పూర్తిగా ప్రకటన రద్దు చేయు అధికారము జిల్లా కలెక్టర్ గారికి కలదు.

అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జత పరచవలెను
మొత్తం పోస్టులు:340
దరఖాస్తులు ప్రారంభం:07.12.21

దరఖాస్తులు ముగింపు తేదీ:16.12.21

39 అంగన్వాడీ కార్యకర్త, 8  మంది మినీ అంగన్వాడీ కార్యకర్త, 293 సహాయక పోస్టులు భర్తీ చేయనున్నారు
 
దరఖాస్తులు ఎవరికి సమర్పించాలి: సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో దాఖలు చేయాల్సి ఉంటుంది.

హిందూపురంలో ఎక్కువ: ప్రాజెక్టుల వారీగా చూస్తే... హిందూపురంలో ఎక్కువగా 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనంత, ఉరవకొండలో 23 ప్రకారం, సీకేపల్లి, కణేకల్లులో 11 చొప్పున, ధర్మవరం 22, కూడేరు, గుత్తి 17 ప్రకారం, కళ్యాణదుర్గం 20, కంబదూరు, కదిరి తూర్పు 16 చొప్పున, మడకశిర 40, పెనుకొండ 38, రాయదుర్గం 14, శింగనమల 21, తాడిపత్రిలో 9 చొప్పున భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు నోటిఫికేషన్ మరియు దరఖాస్తులు క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోగలరు...

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top