Guntur District SC, ST Backlog Posts Recruitment Notification | Schedule 43 Posts @https://www.gunturap.in/scst/

గుంటూరు జిల్లా యందలి షెడ్యూల్డ్ కులముల/షెడ్యూల్డ్ తెగల బ్యాక్లాగ్ పోస్టుల (43 పోస్టులు భర్తీ కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి, అభ్యర్థులు వయస్సు 01.07.2021 నాటికి 18-52 సంవత్సరాల మధ్య గలవారై ఉండవలెను.

1.2 ఆసక్తిగల అభ్యర్థులు 05/12/2021 నుండి 20/2/2021 వరకు https://www.gunturap.in/scst వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.

1.3 పై బ్యాక్లాగ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే దరఖాస్తుదారు, పై తెలిపిన వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు తన/ఆమె వివరాలను నమోదు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ నంబరు జనరేట్ చేయబడుతుంది. దీనిని కాపీ చేసుకుని తదుపరి ఉత్తర ప్రత్యుత్తరాల కొరకు బద్రపరచుకోవలెను.

1.4 సదరు పోస్టుకు కావలసిన ప్రాథమిక విద్యార్హత (పేరా నెం. 1.7 లో ప్రస్తావించిన విధముగా)లో సాధించిన మార్కుల ఆధారంగా పోస్టుకు ఎంపిక చేయబడతారు.

1.5 నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు దరఖాస్తుదారుడు తన వివరాలు సరిచేసుకోవడం కోసం సదరు వెబ్సైట్ని క్రమం తప్పకుండా సందర్శించాల్సి ఉంటుంది. సంబంధిత ఉత్తరప్రత్యుత్తరములకు సదరు వెబ్సైట్ లోనమోదు చేయబడిన వివరాలు మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అభ్యర్ధులు వ్యక్తిగతంగా సంప్రదించకూడదు..

1.6 ఈ బ్యాక్లాగ్ పోస్టుల నియామక నోటిఫికేషన్ లో పేర్కొనబడిన నియమ నిబంధనలు మరియు షరతుల ప్రకారం అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నిర్దేశించబడిన వెబ్ సైట్ అయిన https://www.gunturap.in/scst లో కాకుండా వ్యక్తిగతంగా కానీ మరే ఇతర ఆన్ లైన్ వెబ్ సైట్ లోపంపబడిన అప్లికేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబడవు. అభ్యర్థి ద్వారా సమర్పించబడిన దరఖాస్తు ఫారమ్ ను, అతను / ఆమె నోటిఫికేషన్ ను పూర్తిగా చదివినట్లు మరియు అక్కడ పేర్కొన్న నియమ నిబంధనలు మరియు షరతులకు కట్టుబడి ఉన్నట్లుగా పరిగణిస్తారు.

పేరా అర్హత:

2.1 అభ్యర్థి తప్పనిసరిగా షెడ్యూల్డ్ కులముల / షెడ్యూల్డ్ తెగ లకు చెందిన వారై ఉండవలెను.

2.2 అభ్యర్థిగుంటూరు జిల్లాకు చెందిన స్థానిక నివాసి (local) అయి ఉండాలి. 2.3 పోస్ట్ కోసం నిర్దేశించిన కనీస విద్య మరియు ఇతర అర్హతలు అభ్యర్ధి విధిగా కలిగి ఉండాలి.

2.4 అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం (character) మరియు పూర్వప్రవర్తన (antecedents) కూడా ప్రభుత్వసేవ కోసం ఆ అభ్యర్థి అర్హతలను నిర్ధారింపగలవు.

పేరా 3: విద్యార్హతలు:

ఈ నోటిఫికేషన్ ప్రకటించే తేదీ నాటికి అభ్యర్థి పేరా నెంబర్ 17 లో పేర్కొనబడిన విద్యార్హతను కలిగి ఉండాలి. నిర్దేశిత విద్యార్హతలు కాకుండా తత్సమాన అర్హతలు విషయంలో తుది నిర్ణయం జిల్లా సెలెక్షన్ కమిటీకి చెంది ఉంటుంది.

గమనిక: ఈ నోటిఫికేషన్లో పేర్కొనబడిన నిర్దేశిత అర్హతలు కాకుండా దరఖాస్తుదారు సమానమైన అర్హతను కలిగి ఉంటే, దరఖాస్తుదారుడు దానికి సంబంధిచిన ప్రభుత్వ ఉత్తర్వుల కాపీని, దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ నుండి 7 రోజుల్లోపు జిల్లా సెలక్షన్ కమిటీకి సమర్పించాలి. అలా సమర్పించని యెడల అటువంటి దరఖాస్తులు తిరస్కరించబడును.

పేరా- 4 రిజర్వేషన్లు: 30-4

4.1. షెడ్యూల్డ్ కులముల షెడ్యూల్డ్ తెగల బ్యాక్ లాగ్ రిక్రూట్మెంట్ లో షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి రిజర్వేషన్లు మాత్రమే వర్తిస్తాయి.

4.2. కులం & కమ్యూనిటీ: జి.ఓ.ఎం.ఎస్.నెం.58, ఎస్.డబ్ల్యూ(జె) డిపార్ట్మెంట్, తేది:12.5.97 ప్రకారం సంబంధిత అధికారి ద్వారా జారీ చేయబడిన కమ్యూనిటీ సర్టిఫికేట్ తగిన సమయంలో సమర్పించాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం, రూల్ -2 (28)

4.3. జి.ఓ.ఎం.ఎస్.నెం.63, జి.ఎ. (Ser - D) డిపార్ట్మెంట్, తేదీ: 17.04.2018 ప్రకారం ఎ.పి.ఎస్.సి. రూల్స్ 22-ఎ నిబంధన ప్రకారం 331/3% మేరకు మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది, ఈ రోస్టర్ పాయింట్లను హారిజాంటల్ రిజర్వేషన్లుగా పరిగణింపబడును.

పేరా– 5: స్థానికత:

5.1 ఈ బ్యాక్ లాగ్ పోస్టుల నోటిఫికేషన్ గుంటూరు జిల్లా స్థానిక అభ్యర్ధుల కోసం మాత్రమే నిర్దేశించబడినది కావున స్థానికేతర అభ్యర్థులు అనర్హులు.

5.2 G.O.Ms.No.674, జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SPF-A) డిపార్ట్మెంట్, తేదీ 20.10.1975లో నిర్దేశించినట్లుగా స్టడీ లేదా రెసిడెన్స్ కు సంబంధించి, అభ్యర్థి "స్థానిక అభ్యర్థి"గా దరఖాస్తు చేసుకోవడానికి ఒకే ధృవీకరణ పత్రం వీలు కల్పిస్తుంది. మరియు GOMs.No. 168, GA (SPF.A) శాఖ, తేదీ: 10-3-1977 లో నిర్దేశించిన మార్గదర్శకాలు కూడా అనుసరించాల్సిన అవసరం ఉంది.

5.3 జూన్ 2, 2014 నుండి జూన్ 1, 2021 మధ్య తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు వలస వచ్చిన అభ్యర్థులు జి.ఓ. ఎం.ఎస్. నెం.130 సాధారణ పరిపాలన (ఎస్. పి.ఎఫ్. & ఎం.సి.) డిపార్ట్ మెంట్, తేదీ 29.10.2019 లోని నిబంధనల ప్రకారం సర్క్యులర్ మెమో లో నం.4136/ఎస్. పి.ఎఫ్. & ఎం.సి.)/2015-5, తేదీ. 20.11.2017 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే జారీచేయబడిన లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ను సంబంధిత అధికారి నుండి పొందాలి మరియు ధృవీకరణ పత్రాలు పరిశీలన చేసేటప్పుడు ఆ సర్టిఫికేట్ ను ఇవ్వాలి.

5.4 అభ్యర్థి తన స్థానికతను నిరూపించుకొనుటకు 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్లు మరియు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టుకి నిర్దేశించబడిన ప్రాథమిక విద్యార్హత వరకు గల స్టడీ సర్టిఫికెట్లు మరియు G.O. లలో పేర్కొనబడిన ఏ ఇతర సర్టిఫికెట్లను సమర్పించవలెను.

పేరా 6: వయస్సు:

అభ్యర్థి వయస్సు తేది: 01.07.2021 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు మరియ గరిష్టంగా 52 సంవత్సరాలు ఉండాలి. గమనిక: 18 సంవత్సరాల కంటే తక్కువ మరియు 52 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు అర్హులు కాదు

పేరా - 7: దరఖాస్తు ఎలా చేయాలి:

7.1 ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనుటకు https://www.qunturap.in/scst వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.

7.2 ఆన్లైన్ అప్లికేషన్ను పూరించే ముందు వెబ్సైట్లో "ఆన్లైన్ అప్లికేషన్ నమోదు విధానము" నందు అందించిన సూచనలను పరిశీలించండి.

7.3 "ఆన్లైన్ అప్లికేషన్" పైన క్లిక్ చేయడం ద్వారా మీరు "ఆన్లైన్ అప్లికేషన్ పూరించుటకు సూచనలు" కనుగొంటారు. మరియు సదరు సూచనలను జాగ్రత్తగా చదవండి.

7.4 సూచనలను చదివిన తర్వాత, మీరు 'Proceed to Application" పైన క్లిక్ చేయడం ద్వారా మీకు "దరఖాస్తుదారుల వివరాల నమోదు" చేసుకొను ఫారం ఓపెన్ అవుతుంది. సదరు ఫారంలో మీరు దరఖాస్తు చేయదలచిన పోస్ట్ ఎంచుకుని, ఆపై దరఖాస్తు కులమును ఎంచుకుని, ఆపై "PROCEED" పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పూర్తి వివరాలను నమోదు చేయడానికి మీకు ఆన్లైన్ అప్లికేషన్ చూపబడుతుంది. వివరాలను జాగ్రత్తగా పూరించి, డిక్లరేషన్ను చదివి, ఆపై “SUBMIT" పై క్లిక్ చేయండి.

7.5 ఆన్లైన్ అప్లికేషన్ ను సమర్పించిన తర్వాత, మీకు "APPLICATION RECEIPT" (రశీదు) చూపబడుతుంది. అప్లికేషన్ రసీదును ప్రింట్ తీసుకుని భవిష్యత్ ఉత్తరప్రత్యుత్తరాలకొరకు దానిని భద్రపరచుకొనవలెను.

7.6 దరఖాస్తుదారు ఆన్లైన్లో సమర్పించిన వివరాలను "అప్లికేషన్ సరిచూసుకొనుట" VIEW YOUR APPLICATION) పై క్లిక్ చేయడం ద్వారా నమోదు చేయబడిన వివరాలు సరి చూసుకొనవచ్చును.

7.7 సమర్పించిన దరఖాస్తులో ఏవైనా మార్పులు ఉంటే, అభ్యర్థి హోమ్ పేజీలో అందించిన "అప్లికేషన్ నవీకరణ" (EDIT APPLICATION DETAILS) పై క్లిక్ చేసి తగు మార్పులు చేసుకొనవచ్చును. నమోదు చేసిన వివరాలపై సంతృప్తి చెందిన తర్వాత, దరఖాస్తుదారు “అప్లికేషన్ ప్రింట్” పై క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ యొక్క ప్రింట్ను తీసుకోవచ్చు మరియు భవిష్యత్ ఉత్తరప్రత్యుత్తరాలకొరకు కొరకు దానిని భద్రపరచుకొనవలెను.

గమనిక:

ఎ). తేదీ. 05-12-2021 ఉదయం 10:00 గంటల నుండి తేదీ. 20-12-2021 సాయంత్రం 05:00 గంటల వరకు మాత్రమే ఆన్లైన్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు వివరాలను సవరించడం (Edit) అనుమతించబడుతుంది. తదుపరి తేదీలలో ఏవిధమైన మార్పులు చేర్పులు అనుమతించబడవు.

బి). దరఖాస్తు ఫారమ్ బయో-డేటా వివరాలు పూరించి ఆన్లైన్లో సమర్పించేటప్పుడు దరఖాస్తుదారు ఏవైనా తప్పిదాలు చేసిన యెడల అందుకు జిల్లా సెలక్షన్ కమిటీ బాధ్యత వహించదు. అందువల్ల దరఖాస్తుదారులు దరఖాస్తును సమర్పించే ముందు పేర్కొనబడిన సూచనలను ఖచ్చితంగా పాటించవలెను.

సి). అసంపూర్తిగా/తప్పుగా ఉన్న దరఖాస్తులు తిరస్కరించబడతాయి. నిర్ధిష్ట గడువు తరువాత సమర్పించబడిన ఏ విధమైన సమాచారం అయిననూ జిల్లా సెలక్షన్ కమిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించదు. స్క్రూటినీ సమయంలో అభ్యర్థిచే చేయబడిన ఏదైనా తప్పిదాలు గుర్తించినట్లయితే, రిక్రూట్మెంట్ ప్రక్రియ యొక్క చివరి దశకు వచ్చినప్పటికీ లేదా తదుపరి దశలలో కూడా వారి అభ్యర్థిత్వం తిరస్కరించబడుతుంది మరియు శిక్షకు కూడా బాధ్యత వహించగలరు.

పేరా- 8: నియామక ప్రక్రియ:

8.1 జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా నియామక ప్రక్రియ జరుగుతుంది.

8. జి.ఓ. ఎం.ఎస్. నెం.98 సాధారణ పరిపాలన (సేవలు-ఎ) విభాగం తేదీ: 06.09.2021 ప్రకారం అభ్యర్థులకు ఎటువంటి వ్రాతపరీక్షలు మరియు ఇంటర్వ్యూలు ఉండవు.

8.3 పేరా నెంబర్ 1.7 లో ప్రస్తావించబడిన ప్రాధమిక విద్యార్హత పరీక్షలలో పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే అభ్యర్ధులు ఎంపిక చేయబడతారు.

8.4 జూనియర్ అసిస్టెంట్ / టైపిస్ట్ / జూనియర్ స్టెనో పోస్టులకు, అభ్యర్థి ప్రాథమిక విద్యార్హత లోని గ్రూపు సబ్జెక్టులలో పొందిన మార్కులుఆధారంగా మాత్రమే మెరిట్ పరిగణించబడుతుంది. అనగా లాంగ్వేజ్ సబ్జెక్ట్ లలో పొందిన మార్కులు మెరిట్ నిర్థారించుట కొరకు పరిగణించబడవు.

8.5 ఒకవేళ ఇద్దరు గాని అంతకన్నా ఎక్కువ అభ్యర్థులు సమానమైన మార్కులు పొందినట్లైన, ఆ అభ్యర్థులను బ్రాకెట్ లో గుర్తించబడును. ఆ బ్రాకెట్ లోపల ఉన్న అభ్యర్థుల వయస్సు ప్రకారం ఎక్కువ వయస్సు ఉన్న వారికి 1, 2, 3 ర్యాంకులు ఇవ్వబడును. ఒకవేళ ఆ అభ్యర్ధులు ఒకే వయస్సు కలిగి ఉంటే వారి ప్రాధమిక విద్యార్హత పొందిన తేదీ పరిగణలోకి తీసుకొనబడును.

8.6 జి.ఓ.ఎం.ఎస్. నెం.133, జనరల్ అడ్మినిస్ట్రేషన్ (సర్వీసెస్-డి) డిపార్ట్ మెంట్ తేది: 12.05.2014 ప్రకారం జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం కంప్యూటర్ మరియు అనుబంధ సాఫ్ట్ వేర్ ద్వారా ఆఫీస్ ఆటోమేషన్ నందు నైపుణ్య పరీక్ష నిర్వహించబడుతుంది. పైన పేర్కొన్న నైపుణ్య పరీక్ష ఒక అర్హత పరీక్ష. నైపుణ్యత పరీక్ష లో పొందిన మార్కులు మెరిట్ ను లెక్కించడంలో పరిగణలోకి తీసుకొనబడవు.ఎంపికైన అభ్యర్థుల యొక్క నియామకం అనేది వారు వైద్య పరీక్షలలో తగినవిధముగా ఆరోగ్యంగా ఉండటం పై ఆధారపడి ఉంటుంది మరియు అతను / ఆమె ఆరోగ్యంగా, చురుకైన అలవాట్లు మరియు ఎలాంటి శారీరక లోపం లేదా బలహీనత ఉండకూడదు.

 పేరా 9:- నియామక ప్రక్రియ- తేదిల వివరాలు:


పేరా 10: మెరిట్ మరియు ఇతర విషయాలకు సంబంధించిన సమస్యల పరిష్కరాలు:

10.1. రిక్రూట్మెంట్ యొక్క ప్రతి దశలో, అనగా తాత్కాలిక మెరిట్ జాబితా ప్రచురణ, అభ్యంతరాల పరిష్కారం, తుది మెరిట్ జాబితా ప్రచురణ మొదలైన అన్ని వివరాలు జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా అభ్యర్థుల సౌకర్యార్ధము కొరకు పైన తెలపబడిన వెబ్సైట్ నందు ప్రచురించబడును.

10.2. తాత్కాలిక మెరిట్ జాబితా ప్రచురణ తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ది. 01-02-2022 నుండి 03-02-2022 (5:00 PM) సమయంలోపు వచ్చిన అభ్యంతరాలను మాత్రమే జిల్లా సెలక్షన్ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకొనబడును. మరియు వాటిని వెబ్సైట్లో పొందపరచబడును. సమయం ముగిసిన తర్వాత వచ్చిన అభ్యంతరాలు స్వీకరించబడవు.

పేరా 11 నియామక ప్రక్రియ లోని ముఖ్యమైన చట్టపరమైన అంశాలు:

111. ఖాళీలు: నోటిఫికేషన్ లో జారీచేయబడిన పోస్టులకు మాత్రమే నియామకం జరుగుతుంది. వెయిటింగ్ లిస్ట్ ఉండదు. పైన పేర్కొన్న ఖాళీల సంఖ్య మారవచ్చును.

11.2. నియామక ప్రక్రియ ఈ నోటిఫికేషన్ ప్రకారం మరియు ప్రభుత్వం జారీ చేసిన నియమాలు మరియు సూచనలకు లోబడి నిర్వహించబడుతుంది మరియు ఎప్పటికప్పుడు జిల్లా సెలక్షన్ కమిటీద్వారా అదనపు సూచనలు నిర్ణయించబడును.

11.3. రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం అత్యంత పారదర్శకతతో నిర్వహించబడుతుంది, మెరిట్ సూత్రాన్ని ఖచ్చితంగా పాటించేలా చూడబడుతుంది.

11.4. ప్రభుత్వ సర్వీస్/ అటానమస్ బాడీన్ / ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థలు మొదలైన వాటిలో శాశ్వత లేదా తాత్కాలిక ప్రాతిపాదికన పనిచేస్తున్న ఉద్యోగులు ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నచో, వారు వారి కార్యాలయపు అధికారి / డిపార్ట్ మెంట్ కు లిఖితపూర్వకంగా తెలియజేయాలి.

11.5 అభ్యర్థి తన నియామకం కోసం, తాను/ఆమె లేదా వారి బంధువులు లేదా స్నేహితులు లేదా ఇతరులు ఎవరి ద్వారానైనా అధికారికంగా లేదా అనధికారికంగా కానీ అదనపు మద్దతు కోసం ప్రయత్నించిన యెడల ఆ అభ్యర్థి నియామకానికి అనర్హులు.

11.6. ఓపెన్ యూనివర్సిటీలు/ దూర విద్యా విధానం ద్వారా పొందిన డిగ్రీలు తప్పనిసరిగా దూర విద్యా మండలి, భారత ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొంది ఉండాలి. అటువంటి డిగ్రీలను దూర విద్యా మండలి గుర్తించకపోతే వారి ప్రాధమిక విద్యార్హత అంగీకరించబడదు. ఏవైన సందేహాలు ఉన్నట్లయితే, అభ్యర్థులు దూర విద్యా మండలి ద్వారా వారి ఢిగ్రీలు,విశ్వవిద్యాలయాలు గుర్తించబడ్డాయి అని రుజువుపరచుటకు బాధ్యత వహించవలెను. అభ్యర్థులు జి.ఓ.ఆర్.టి.నెం. 143, ఉన్నత విద్య (ఇ.సి. డిపార్ట్మెంట్, తేదీ: 11.7.2018 మరియు సుప్రీంకోర్టు తీర్పు తేదీ: 3.11.2017 ని కూడా

11.7 అభ్యర్థుల సౌకర్యార్థమై ఈ నోటిఫికేషన్ పూర్తి ప్రతిని తెలుగు భాషలో కూడా ప్రచురించటం జరిగినది. నోటిఫికేషన్ లో పేర్కొనబడిన ఏ అంశములోనైనా సందేహము ఉన్నయెడల ఇంగ్లీషు భాష నందు ప్రచురించబడిన విషయాన్ని ప్రామాణికముగా తీసుకొనవలెను.

For Latest Updates Join Whatsapp and Telegram Groups:

Join Whatsapp Group: Click Here

Join Telegram GroupClick Here

Notifiaiton: Englsih Telugu

Official Website and Online Applicaiton:Click Here

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top