Vzrm Contract Jobs: విజయనగరం జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీసీ), స్పెషలైజేడ్ అడాప్షన్ ఏజెన్సీ (ఎస్ఏఏ), చిల్డ్రన్ హోమ్స్‌లో ఖాళీగా ఉన్న 23 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించారు.
Join Our Free Social Media Educational Free Alerts Groups:
ఈ పోస్టులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేస్తారు. పనితీరు ఆధారంగా వారి సర్వీసును కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఇందులో అర్హులైన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకం జరుపుతారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఉద్యోగులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు ఉండదు. అయితే ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగానికి మాత్రం కంప్యూటర్ పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా నియామం చేస్తారు. కాంట్రాక్ట్ బేసిస్-5, అవుట్ సోర్సింగ్ బేసిస్-9, పార్ట్ టైమ్-9 పోస్టులను భర్తీ చేస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్
ను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తి చేయాలి.
అనంతరం సంబంధిత సర్టిఫికేట్లను జతచేసి, సెప్టెంబర్ 21 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, మొదటి అంతస్తు, కలెక్టరేట్ కాంప్లెక్స్, విజయనగరం జిల్లా-535003లో అందజేయాలి.
పోస్టులు ఇవే..
మొత్తం 23 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- 1 (డీసీపీయూ), అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్- 1 (డీసీపీయూ), సోషల్ వర్కర్ కం ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేటర్-1 (ఎస్ఏఏ, విజయనగరం, మహిళలు మాత్రమే), స్టోర్ కీపర్- 2 (గజపతి నగరం-1, బొబ్బిలి-1,
మహిళలు మాత్రమే), కుక్- 4 (విజయనగం-2, గజపతినగరం-1, బొబ్బిలి-1 మహిళలు మాత్రమే ), హెల్పర్ కం నైట్ వాచ్‌మెన్-3 (విజయనగం-1, గజపతినగరం-1, బొబ్బిలి-1 మహిళలు మాత్రమే ), హౌస్ కీపర్- 2 (విజయనగం-1, గజపతినగరం-1 మహిళలు మాత్రమే ), ఎడ్యుకేటర్- 3 (విజయనగం-1, గజపతినగరం-1, బొబ్బిలి-1 మహిళలు మాత్రమే ), ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్- 3 (విజయనగం-1, గజపతినగరం-1, బొబ్బిలి-1 మహిళలు మాత్రమే ), పీటీ ఇన్ట్స్రక్టర్ కం యోగ టీచర్- 3 (విజయనగం-1, గజపతినగరం-1, బొబ్బిలి-1 మహిళలు మాత్రమే ) పోస్టులు భర్తీ చేయనున్నారు.
వేతనం...వయో పరిమితి
డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- రూ.44,023, అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్-రూ.13,240, సోషల్ వర్కర్ కం ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేటర్-రూ.18,536, స్టోర్ కీపర్- రూ. 18,536, కుక్- రూ.9,930, హెల్పర్ కం నైట్ వాచ్‌మెన్- రూ.7,944,
హౌస్ కీపర్- రూ.7,944, ఎడ్యుకేటర్- రూ.10,000, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్- రూ.10,000, పీటీ ఇన్ట్స్రక్టర్ కం యోగ టీచర్- రూ.10,000 నెలవారీ వేతనం ఉంటుంది. దరఖాస్తు దాఖలు చేసే అభ్యర్థుల వయో పరిమితి 2024 జులై 1 నాటికి 25 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు కూడా వర్తిస్తుంది.
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్
Download complete Notification ను క్లిక్ చేయండి.
దరఖాస్తు చేసే విధానం:
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, మొదటి అంతస్తు, కలెక్టరేట్ కాంప్లెక్స్, విజయనగరం జిల్లా-535003లో దరఖాస్తులు అందజేయాలి.
0 comments:
Post a Comment