Telangana Government Jobs: 1,284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. వారికి వెయిటేజ్.. పే స్కేలు, ఇతర వివరాలు ఇవే..

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా తొలి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం..

Join Our Free Social Media Job Notifications Free Alerts Groups:

Join Our Telegram Job Notifications Channel Click Here

Join Our Whatsapp Job Notifications Channel Click Here

జాబ్ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్‌లో వైద్యారోగ్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్స్ (గ్రేడ్ 2), నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్సు), ఫార్మాసిస్టు (గ్రేడ్ 2), ఫార్మాసిస్టు (ఆయుష్)లకు సంబంధించిన పోస్టుల నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. అయితే తాజాగా వైద్యాశాఖలో వివిధ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 1,284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే స్టాఫ్ నర్సు, ఫార్మాసిస్టు పోస్టులకు సంబంధించి కూడా ఇదే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు.
1,284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 21 నుంచి అక్టోబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తుల్లో ఏదైనా పొరపాట్లు ఉంటే అక్టోబర్ 5 నుంచి 7వ తేదీ మధ్యలో ఎడిట్ చేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పరీక్షను నవంబర్ 10వ తేదీన సీబీటీ మోడ్‌లో నిర్వహించనున్నారు. అయితే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. రెండు, మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్టుగా తెలిపారు. అయితే పరీక్ష పేపర్ ఇంగ్లీష్‌లోనే ఉంటుందని పేర్కొన్నారు.


అయితే ఈ పోస్టుల భర్తీలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇదే విభాగంలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిజేసే వారికి వెయిటేజ్‌ మార్కులు కల్పించనున్నట్టుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఆస్ప్రతుల్లో పనిచేసిన అనుభవమున్నట్లు ధ్రువ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తెలంగాణ పారామెడికల్‌ బోర్డులో తమ విద్యార్హత ధృవపత్రాలను రిజిష్ట్రేషన్‌ చేసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు.

విద్యార్హతలు..
ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది వాటిలో ఏదో ఒక విద్యార్హతను కలిగి ఉండాలి..
>> సర్టిఫికెట్ ఇన్ ల్యాబోరేటరీ టెక్నిషియన్ కోర్సు
>> ఎంఎల్‌టీ (వీవోసీ) / ఇంటర్మీడియట్ (ఎంఎల్‌టీ వొకేషనల్).. ఒక ఏడాది క్లినికల్ ట్రైనింగ్/అప్రెంటిషిప్‌ ట్రైనింగ్
డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు (డీఎంఎల్‌టీ)
>> బీఎస్సీ (ఎంఎల్‌టీ)/ ఎంఎస్సీ(ఎఎల్‌టీ)
>> డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ (క్లినికల్ పాథాలజీ) టెక్నీషియన్ కోర్సు
>> బ్యాచ్‌లర్ ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ (బీఎంఎల్‌టీ)
>> పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ
>> పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయో కెమిస్ట్రీ
>> బీఎస్సీ (మైక్రో బయోలజీ) / ఎంఎస్సీ (మైక్రో బయోలజీ)
>> ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయో కెమిస్ట్రీ
>> ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రో బయోలజీ
>> ఎంఎస్సీ ఇన్ బయో కెమిస్ట్రీ
విభాగాలు, జోన్ల వారీగా పోస్టులు
>> మొత్తం 1,284 పోస్టుల్లో ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో 1,088 , తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో 183 , హైదరాబాద్‌ ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో 13 పోస్టులు ఉన్నాయి.
>> జోన్‌ల వారీగా.. జోన్‌ 1లో 218, జోన్ 2లో 135, జోన్ 3లో 173, జోన్‌ 4లో 191, జోన్ 5లో 149, జోన్ 6లో 220, జోన్ 7లో 185 పోస్టులు ఉన్నాయి.

పరీక్ష కేంద్రాలు..
హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట

నోటిఫికేషన్‌లోని ఇతర ముఖ్యాంశాలు..
>> అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించేందుకు, నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm సందర్శించాలి.

>> వయోపరిమితి.. అభ్యర్థులు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 ఏళ్లకు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు.
>> పోస్టులో 95 శాతం స్థానికులకే.. ఇందుకు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు తెలంగాణలో చదివి ఉండాలి.
>> ఆన్‌లైన్ పరీక్ష ఫీజు రూ. 500, ప్రాసెసింగ్ ఫీజు రూ. 200
>> అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీమెచ్, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు.
>> తెలంగాణలోని 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు కూడా ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు.
>> ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్ ఆస్ప్రతుల్లో పోస్టులకు పే స్కేలు.. 32,810 - 96,890
>> ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రులలో పోస్టులకు పే స్కేలు.. 31,040 - 92,050

>> పోస్టుల నియమాక ప్రక్రియ వంద మార్కలు ప్రతిపాదికన చేపడతారు.. రాత పరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజ్ కింద కలుపనున్నారు.
>> మెరిట్ జాబితాను బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top