నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRBs) గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్ఆర్‌బీలో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. RRB NTPC 2024 రిక్రూట్‌మెంట్ కోసం అధికారికంగా నోటిఫికేషన్‌ను ప్రకటించింది.
భారతీయ రైల్వేలలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల(NTPC) పోస్టుల కోసం మొత్తం 11558 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 2న విడుద చేశారు. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియ, ఇతర సంబంధిత సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.
మెుత్తం ఖాళీలు: 11558
గ్రాడ్యుయేట్ (లెవెల్ 5, 6), అండర్ గ్రాడ్యుయేట్ ( లెవెల్ 2, 3) పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 11,558 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 14న ప్రారంభమవుతుంది. 13 అక్టోబర్ 2024 వరకు కొనసాగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ 21 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ 2024 వరకు ఉంటుంది.
గ్రాడ్యుయేట్ పోస్టుల్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉండే అవకాశం ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో చూసుకుంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ఉద్యోగాలు ఉండే ఛాన్స్ ఉంది.
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ కంప్లీట్ చేయాలి.
పరీక్ష విధానం
ఆన్‌లైన్ పరీక్ష స్టెప్ 1 -CBT 1
ఆన్‌లైన్ పరీక్ష స్టెప్ 2 - CBT 2
టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) / ఆప్టిట్యూడ్ టెస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
వైద్య పరీక్ష
ఎలా దరఖాస్తు చేయాలి?
స్టెప్ 1. RRB అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ను సందర్శించండి.
స్టెప్ 2. RRB NTPC 2024 నోటిఫికేషన్‌ను గుర్తించి,
దానిని జాగ్రత్తగా చదవండి.
స్టెప్ 3. ప్రాథమిక వివరాలను అందించడం ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
స్టెప్ 4. కచ్చితమైన సమాచారంతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
స్టెప్ 5. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 6. దరఖాస్తు రుసుము చెల్లించండి.
స్టెప్ 7. పూర్తి చేసిన దరఖాస్తును గడువులోపు సమర్పించండి.
0 comments:
Post a Comment