దేశవ్యాప్తంగా కేంద్ర శాఖల్లో ఇంజినీరింగ్ కొలువుల భర్తీకి సంబంధించి 'ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2025' నోటిఫికేషన్ విడుదల చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సమాయత్తమవుతోంది. యూపీఎస్సీ వార్షిక క్యాలెండర్ 2025 ప్రకారం సెప్టెంబర్ 18న ప్రకటన విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూపీఎస్సీ దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది.
Join Our Free Social Media Job Notifications Free Alerts Groups:
దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 18న ప్రారంభమై.. అక్టోబర్ 8వ తేదీతో ముగుస్తుంది. ఫిబ్రవరి 9న రాత పరీక్ష నిర్వహిస్తారు. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలు భర్తీ కానున్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంఎస్సీ చదివిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. స్టేజ్-1(ప్రిలిమినరీ/ స్టేజ్-1) ఎగ్జామ్, స్టేజ్-2(మెయిన్/ స్టేజ్-2) ఎగ్జామ్, స్టేజ్-3 (పర్సనాలిటీ టెస్ట్), మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
0 comments:
Post a Comment