ITBP: ఐటీబీపీలో 128 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు

ITBP: ఐటీబీపీలో 128 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)... నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) గ్రూప్-సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి


ఖాళీల వివరాలు:

1. హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ) (పురుషులు/ మహిళలు) 09 పోస్టులు

2. కానిస్టేబుల్ (యానిమల్ అటెండెంట్) (పురుషులు/ మహిళలు): 115 పోస్టులు

3. కానిస్టేబుల్ (కెన్నెల్మన్) (పురుషులు మాత్రమే): 4 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 128.

అర్హత: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి, వెటర్నరీలో సర్టిఫికెట్/ డిప్లొమా కోర్సు: కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 10-09-2024 నాటికి హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ), కానిస్టేబుల్ (కెన్నెల్మన్) పోస్టులకు 18-27 ఏళ్లు; కానిస్టేబుల్ (యానిమల్ అటెండెంట్) పోస్టులకు 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

పే స్కేల్: హెడ్ కానిస్టేబుల్కు రూ.25,500. కానిస్టేబుల్ కు రూ.21,700.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు...

* ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 30-08-2024. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29-09-2024.

ముఖ్యాంశాలు:

* ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)- హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

* అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

Download Complete Notification

Official Website

Online Application 

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top