న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్సెట్)- 7 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 21వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రకటన వివరాలు:
* నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ సంస్థలు: ఎయిమ్స్ భటిండా, ఎయిమ్స్ భువనేశ్వర్, ఎయిమ్స్ బిలాస్పూర్, ఎయిమ్స్ దేవఘర్, ఎయిమ్స్ గోరఖ్పూర్, ఎయిమ్స్ గువాహటి, ఎయిమ్స్ జోధ్పుర్, ఎయిమ్స్ కల్యాణి, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ నాగ్పుర్, ఎయిమ్స్ రాయ్ బరేలీ, ఎయిమ్స్ న్యూదిల్లీ, ఎయిమ్స్ పట్నా, ఎయిమ్స్ రిషికేశ్, ఎయిమ్స్ విజయ్పూర్.
అర్హత: డిప్లొమా (జీఎన్ఎం) తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్- బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్/ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.
వయోపరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్-సర్వీస్ మెన్లకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: రూ.9,300- రూ.34,800 తో పాటు రూ.4600 గ్రేడ్ పే అందుతుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: నార్ సెట్-7 ప్రిలిమినరీ, ప్రధాన పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్
ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.08.2024.
దరఖాస్తుల సవరణ తేదీలు : 22.08.2024 2 24.08.2024 2.
* సీబీటీ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 15-09-2024.
* సీబీటీ మెయిన్ పరీక్ష తేదీ: 04-10-2024.
0 comments:
Post a Comment