India Post GDS Jobs Cutoff Marks: తపాలా శాఖలో పోస్టల్‌ జాబ్‌ రావాలంటే.. కటాఫ్‌ ఎంత ఉండాలో తెలుసా?

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికి ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే
ఈ నోటిఫికేషన్‌ కింద దేశంలో వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో దాదాపు 44,228 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో సాధించిన మార్కులు, గ్రేడ్‌ మెరిట్‌ ద్వారా మాత్రమే ఈ నియామకాలు చేపడతారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో 1355 పోస్టులు, తెలంగాణలో 981 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్ధులు ఆయ తపాలా బ్రాంచ్‌లలో బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు, బ్రాంచుల వారీగా ఖాళీల వివరాలు, ఏ హోదాలో ఎన్న పోస్టులు ఉన్నాయి, రిజర్వ్‌డ్‌/ అన్‌ రిజర్వ్‌డ్‌ వంటి పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వాటి ప్రకారం అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలని తపాలా శాఖ సూచించింది.

మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకూ ఒకే మార్కులు వస్తే.. వారిలో ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. పోస్టులకు ఎంపికైన వారి ఫోన్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా లేదంటే ఈమెయిల్‌ లేదా పోస్టు ద్వారా సమాచారం అందిస్తారు. సమాచారం అందిన రెండు వారాల్లోగా అభ్యర్థులు సంబంధిత సెంటర్‌లలో ధ్రువపత్రాల పరిశీలకు హాజరుకావాల్సి ఉంటుంది. అనంతరం ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుతాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ) పలు డివిజన్‌లలో 2023-24 సంవత్సరానికిగానూ జీడీఎస్‌ నియామకాలకు సంబంధించి కటాఫ్‌ మార్కులను అధికారులు వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం..

అభ్యర్ధులకేటగిరీ ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్ మార్కులు తెలంగాణ సర్కిల్‌ మార్కుల

అన్‌రిజర్వ్‌డ్‌………. 99.3333 …………………..93.8333
ఈడబ్ల్యూఎస్‌………. 99.3333 …………………..95
ఎస్సీ………. 99 …………………..95
ఎస్టీ………. 95.6667 …………………..95
ఓబీసీ………. 99.1667 …………………..95
పీడబ్ల్యూడీ-ఎ………. 92.5 …………………..93.4167
పీడబ్ల్యూడీ-బి………. 76.8333(4వ జాబితా) …………………..68.4
పీడబ్ల్యూడీ-డీఈ………. – …………………..90.25
పీడబ్ల్యూడీ-సి………. 92.6667 …………………..90.25
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top