SAIL Management Trainee Recruitment 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (Steel Authority of India Limited) భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 249 మేనేజ్మెంట్ ట్రైనీ (Management Trainee) పోస్టుల భర్తీ చేయడం కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు, యూనిట్లు, గనుల్లో పని చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల ప్రక్రియ జులై 5వ తేదీ నుంచి ప్రారంభమైంది. జులై 25 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడొచ్చు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలివే :
కెమికల్ ఇంజినీరింగ్ - 10 పోస్టులు
సివిల్ ఇంజినీరింగ్ - 21 పోస్టులు
కంప్యూటర్ ఇంజినీరింగ్ - 9 పోస్టులు
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 61 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ - 5 పోస్టులు
ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ - 11 పోస్టులు
మెకానికల్ ఇంజినీరింగ్ - 69 పోస్టులు
మెటలర్జీ ఇంజినీరింగ్ - 63 పోస్టులు
ముఖ్య సమాచారం :
విద్యార్హతలు: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితోపాటు గేట్-2024 స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 2024 జులై 25 నాటికి 28 ఏళ్లు మించి ఉండకూడదు. అయితే ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.700 చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక ప్రక్రియ : గేట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా మెరిట్ సాధించిన అభ్యర్థులను మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు: మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు మొదట సెయిల్ అధికారిక వెబ్సైట్ https://www.sail.co.in/ ఓపెన్ చేయాలి.
అనంతరం కొత్త యూజర్ అయితే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకోవాలి.
అప్పుడు మీకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది.
ఈ యూజర్ ఐడీ, పాస్వర్డ్లతో వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి.
అప్లికేషన్ ఫామ్లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
అవసరమైన అన్ని పత్రాలు అప్‌లోడ్ చేయాలి.
అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్ను సబ్‌మిట్ చేసి.. అప్లికేషన్‌ను ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : జులై 5, 2024
ఆన్లైన్ దరఖాస్తులకు ఆఖరు తేదీ : జులై 25, 2024
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment