నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (CIET) కింద అకడమిక్ కన్సల్టెంట్, ట్రాన్స్ లేటర్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల భర్తీ కోసం NCERT నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు ఉన్న అభ్యర్థులు NCERT అధికారిక వెబ్‌సైట్, ncert.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లయ్ చేయడానికి చివరి తేదీ మే 10. ఈ పోస్టులపై ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులందరూ ముందుగా కింద ఇచ్చిన విషయాలను జాగ్రత్తగా చదవాలి.
పోస్టుల వివరాలు
అకడమిక్ కన్సల్టెంట్- 03 పోస్టులు
ట్రాన్స్ లేటర్- 23 పోస్టులు
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో- 04 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 30
విద్యార్హత
అకడమిక్ కన్సల్టెంట్- అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి Ph.D డిగ్రీని కలిగి ఉండాలి.
ట్రాన్స్ లేటర్- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి
వయోపరిమితి
అకడమిక్ కన్సల్టెంట్ - 45 సంవత్సరాలు మించకూడదు
ట్రాన్స్ లేటర్- 45 సంవత్సరాలు మించకూడదు
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో - 40 సంవత్సరాలు మించకూడదు
ఎంపిక ఇలా జరుగుతుంది
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా ఫలితాలు సిద్ధం చేయబడతాయి.
జీతం
అకడమిక్ కన్సల్టెంట్- రూ 60000
ట్రాన్స్ లేటర్- రూ 30000
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో - రూ 31000
0 comments:
Post a Comment