DRDO: ఐటీఐ పూర్తి చేసి మంచి ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైనేషన్ (DRDO)లో ఐటీఐ అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ జారీ అయింది. డీఆర్‌డీవో ఆధ్వర్యంలో పనిచేసే డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ (DMRL)లో అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్ ఇండియా అధికారిక పోర్టల్ www.apprenticeshipindia.org విజిట్ చేసి మే 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్‌మెంట్ పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
ఖాళీల వివరాలు
డీఆర్‌డీఓ ఐటీఐ అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా 127 ఖాళీలు భర్తీ కానున్నాయి. అందులో ఫిట్టర్ 20, టర్నర్ 8, మెషినిస్ట్ 16, వెల్డర్ 4, ఎలక్ట్రీషియన్ 12, ఎలక్ట్రానిక్స్ 4, కోపా(COPA) 60, కార్పెంటర్ 2, బుక్ బైండర్ ఒక పోస్ట్ భర్తీ కానుంది.
వయోపరిమితి
దరఖాస్తుదారుల వయసు కనీసం 18 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 55 ఏళ్ల లోపు ఉండాలి.
* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
దరఖాస్తుదారులు సంబంధిత ట్రేడ్స్‌లో ITI పూర్తిచేసి ఉండాలి. అయితే NCVT, SCVT నుంచి ITI అర్హత పరీక్ష క్వాలిఫై అయిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు ప్రక్రియ
- ముందుగా అప్రెంటిస్‌షిప్ ఇండియా అధికారిక పోర్టల్ www.apprenticeshipindia.org ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలోకి వెళ్లి, DMRL DRDO అప్రెంటిస్‌షిప్-2024 లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి.
- ‘అప్లై నౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి.
- ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
- ఆ తర్వాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.
అన్ని వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ ఫిలప్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- చివరగా అప్లికేషన్ ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పలు దశల్లో ఉంటుంది. పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ తరువాత ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.
* కెరీర్ అవకాశాలు
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది ITI గ్రాడ్యుయేట్స్‌కు అద్భుతమైన ఎంపిక. DRDO అనేది డిఫెన్స్ టెక్నాలజీలో అడ్వాన్స్‌డ్ రీసెర్చ్, డెవలప్‌మెంట్‌లో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో అప్రెంటీస్‌షిప్ ద్వారా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో ట్రైనింగ్ పొందవచ్చు. అమూల్యమైన అనుభవం, నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. ఫలితంగా రక్షణ రంగానికి సంబంధించిన అనేక కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
ట్రైనింగ్ వివరాలు
హైదరాబాద్‌లోని డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీలో ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ వ్యవధి ఒక సంవత్సరం. దరఖాస్తుదారులు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అవసరమైన డాక్యుమెంట్‌లు
యాక్టివ్ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్(పదో తరగతి, ఐటీఐ), వయసు ధృవీకరణ పత్రం, ఫోటో, డిజిటల్ సిగ్నేచర్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్, ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్ బుక్ కాపీ, ఆధార్ కార్డ్, అడ్రస్ ఫ్రూఫ్, కుల ధృవీకరణ పత్రం, వంటివి తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఈ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment