ఇండియన్ ఆర్మీలో ఉచిత ఇంజినీరింగ్ విద్యకు '10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్' నోటిఫికేషన్ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

INDIAN ARMY 10+2 TECHNICAL ENTRY SCHEME - 52: ఇండియన్ ఆర్మీలో జనవరి 2025లో ప్రారంభమయ్యే 52వ '10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(TES)' కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది

దీనిద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్) 2024లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి మే 13న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వివరాలు..

* టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 52 కోర్సు(టీఈఎస్)- జనవరి 2025

మొత్తం ఖాళీలు: 90

అర్హత: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ (మెయిన్స్) 2024లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:16½ -19½ సంవత్సరాల మధ్య ఉండాలి

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

శిక్షణ ఇలా..
➥ కోర్సులో చేరినవాళ్లకి నాలుగేళ్లపాటు శిక్షణ ఉంటుంది.

➥ ఇందులో ఫేజ్-1 కింద సీఎంఈ, పుణె లేదా ఎంసీటీఈ మోవ్(మధ్యప్రదేశ్) లేదా ఎంసీఈఎంఈ, సికింద్రాబాద్లో మూడేళ్లపాటు ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలిటరీ శిక్షణ ఉంటుంది ఇక ఫేజ్-2లో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఏడాదిపాటు ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ & ఇంజినీరింగ్ ట్రైనింగ్ ఉంటుంది.

➥ శిక్షణకు ఎంపికైనవారు ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు చదువుతారు.

వేతనం ఇలా..

మూడేళ్ల శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. నాలుగేళ్ల శిక్షణ అనంతరం పూర్తి వేతనం అమలవుతుంది. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్న వారికి ఢిల్లీలోని జేఎన్యూ ఇంజినీరింగ్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. వీరిని తదనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.05.2024.

* ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13.06.2024.

Online Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top