APETD Recruitment Notification 2024 : ఏపీ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ (APETD) తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు ఐటీఐ (ITI)ల్లో 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే.. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపాదికన రిక్రూట్ చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ఉపాధి, శిక్షణ శాఖ వివరాలను వెల్లడించింది.
ముఖ్య సమాచారం :
అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ATO) జాబ్స్ - 71
జోన్ల వారీగా పోస్టులు : జోన్ -1లో ట్రేడ్‌ల వారీగా ఖాళీలు చూస్తే డ్రెస్ మేకింగ్- 01, మెషినిస్ట్- 01. ఫిట్టర్- 2, కార్పెంటర్- 1,వెల్డర్- 01 పోస్టు ఉంది. ఇక జోన్- 2లో చూస్తే ఇంజినీరింగ్ డ్రాయింగ్- 01, టర్నర్- 03,మెషినిస్ట్- 01, మెకానిక్ డీజిల్- 1, ఫిట్టర్- 1, మ్యాథ్స్ కమ్ డ్రాయింగ్- 01 ఉద్యోగాలు ఉన్నాయి. జోన్-3లో డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్- 02, ఫిట్టర్- 01 పోస్టులు ఉండగా.. జోన్-4 లో 54 ఖాళీలున్నాయి.
అర్హతలు : సంబంధిత కోర్సుల్లో బి.ఒకేషనల్/ డిగ్రీ/ డిప్లొమా/ ఎన్‌టీసీ / ఎన్‌ఏసీ ఉత్తీర్ణత పొందాలి. పని అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి : 30.09.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్లను ఆధారంగా వయోసడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం : రాత పరీక్షతో పాటు ప్రాక్టికల్ డెమో కూడా ఉంటుంది.
ఎగ్జామ్ విధానం : రాత పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రాత పరీక్షకు 70 మార్కులు, అనుభవానికి 10 మార్కులు, ట్రేడ్‌లో ప్రాక్టికల్ డెమోకు 20 మార్కులు కేటాయించారు. ఇందులో వచ్చే స్కోరింగ్ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.500
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ : మార్చి 01, 2024
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : మార్చి 20, 2024
పరీక్ష జరిగే తేదీ: మే 6, 2024
0 comments:
Post a Comment