Vizag Agniveer Recruitment Rally 2024: విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ 'అగ్నిపథ్' స్కీమ్ కింద 2024-25 సంవత్సరానికి సంబంధించి అగ్నివీరుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది
ఫిబ్రవరి 13వ తేదీతో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా…దరఖాస్తుల సమర్పణకు మార్చి 22 వరకు గడువు విధించారు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఎంపికైనవారు ఇండియన్ ఆర్మీలో నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులుగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి…
ముఖ్య వివరాలు:
రిక్రూట్ మెంట్ ప్రకటన - ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, విశాఖపట్నం .
పోస్టులు -అగ్నిపథ్'స్కీమ్ లో భాగంగా అగ్నీవీరుల నియామకం.
పోస్టులు - అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, అగ్నివేర్ ట్రేడ్స్ మ్యాన్.
అర్హతలు -అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్టుకు కనీసం పదో తరగతిలో 45 మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. టెక్నికల్ పోస్టుకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఐటీఐ కూడా ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు చూస్తే..60 శాతం మార్కులతో ఇంటర్ పాసై ఉండాలి. ట్రేడ్స్ మ్యాన్ కు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి- 17.5 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు - ఎత్తు 166 సెం.మీ ఉండాలి. కొన్ని పోస్టులకు 162 సెం.మీ ఉన్నా సరిపోతుంది. గాలిపీల్చినప్పుడు ఛాతి సెం.మీ పెరగాలి. ఎత్తుకు తగినంత బరువు కూడా కలిగి ఉండాలి.
దరఖాస్తులు - ఆన్ లైన్
దరఖాస్తు రుసుం - రూ.250.
దరఖాస్తులు ప్రారంభం - ఫిబ్రవరి 13, 2024.
దరఖాస్తుల స్వీకరణ తుది గడువు - మార్చి 22, 2024.ఎంపిక విధానం- ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. రిక్రూట్‌మెంట్ ర్యాలీ(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్/ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు- అగ్నివీరులాగ ఎంపికైనవారు నాలుగేళ్లు ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం నెలకు రూ.30,000, రెండో సంవత్సరం నెలకు రూ.33,000 చెల్లిస్తారు. మూడో సంవత్సరం నెలకు రూ.36,000, నాలుగో సంవత్సరం నెలకు రూ.40,000 చొప్పున చెల్లిస్తారు.
ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం - 22. ఏప్రిల్ 2024.
అధికారిక వెబ్ సైట్ - https://joinindianarmy.nic.in
0 comments:
Post a Comment