కాకినాడ నగరం: ఉపాధి కార్యాలయంలో ఈ నెల 16న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ మేళా ప్రారంభమవు తుందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 14 కంపెనీలు రానున్నాయని ఆయన తెలిపారు. దాదాపు 1600 మందిని వివిధ ఉద్యో గాలకు ఎంపిక చేసుకుంటారని శ్రీనివాసరావు వివరించారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమో, బి.టెక్, హోటల్ మేనేజ్మెంట్, తదితర విద్యార్హతలు ఉన్న యువతీయువకులు హాజరు కావాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. ఇతర వివరాలకు కార్యాలయ ఫోన్ నంబరు 0884-2373270ను పనివేళల్లో సంప్రదిం చాలని ఆయన సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment