EIL: ఇంజినీర్స్‌ ఇండియన్‌ లిమటెడ్‌ న్యూఢిల్లీలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

EIL Recruitment: న్యూఢిల్లీలోని ఇంజినీర్స్ ఇండియన్ లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 43 పోస్టులను భర్తీ చేయనున్నారు.

EIL Recruitment: న్యూఢిల్లీలోని ఇంజినీర్స్ ఇండియన్ లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 43 పోస్టులను భర్తీ చేయనున్నారు.  ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు- బీఈ/బీటెక్/బీఎస్సీ (సంబంధిత ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోర్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 5వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..

ఖాళీల సంఖ్య: 43

మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 

విభాగాల వారీగా ఖాళీలు..

కెమికల్ ఇంజినీరింగ్: 07 పోస్టులు

అర్హత: కనీసం 65% మార్కులతో ఫుల్ టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ (కెమికల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోర్ కలిగి ఉండాలి.

మెకానికల్ ఇంజినీరింగ్: 21 పోస్టులు

అర్హత: కనీసం 65% మార్కులతో ఫుల్ టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ (మెకానికల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోర్ కలిగి ఉండాలి.

సివిల్ ఇంజినీరింగ్: 15 పోస్టులు

అర్హత: కనీసం 65% మార్కులతో ఫుల్ టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ (సివిల్ ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోర్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 25 సంవత్సరాలు, ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులు 28 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 30 సంవత్సరాలు,  
పీడబ్ల్యూడీ(జనరల్) అభ్యర్థులు 35 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఓబీసీ-ఎన్‌సీఎల్) అభ్యర్థులు 38 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ(ఎస్సీ/ఎస్టీ) అభ్యర్థులు 40 సంవత్సరాలు ఉండాలి.

ఎంపిక విధానం: గేట్ స్కోర్, షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

పోస్టింగ్ స్థలం: భారతదేశం & విదేశాలలోని ప్రాజెక్ట్ సైట్లు.

వేతనం: నెలకు రూ.60,000.

దరఖాస్తులకు చివరి తేది:  05.03.2024.


Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top