Clarification and Extension of Date for DSC 2024

1. అప్లికేషన్ నుండి రిజర్వేషన్ రోస్టర్ వరకు అంత అయోమయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం (టీవో ఎం. ఎస్ No. 77, General Administration, (Services D) Department, dated 1:02.08.2023) రోస్టర్లు కూడా చూపించడం జరిగింది. కానీ బ్యాగ్ పోస్టులు పోస్టుల విషయంలో ఆ సంవత్సరం రిక్రూట్మెంట్ యొక్క రోస్టర్ ను అలాగే కొనసాగించవలెను ఎందుకనగా తేదీ: 02.08.2023 న జారీచేసిన జీవో ১০. No. 77, General Administration, (Services -D) Department ఉత్తర్వు Prospective గానే ఉంటుంది కానీ retrospective కాదు. పత్రికవారు నిబంధనలు తెలుసుకోకుండా వార్తను ప్రకటించడం వలన అభ్యర్థులు ఆందోళనకు గురైనారు. (జీవో జత పరచడమైనది).

2. మొదటి దరఖాస్తుదారులకు కనిపించని ఈడబ్ల్యూఎస్ కోట 
ఇది అవాస్తవము. దరఖాస్తు జారీచేసిన తేదీ నుండి ఆప్షన్ లో ఈడబ్ల్యూఎస్ పొందుపరచబడినది.

3. పొరపాట్లు జరిగితే అభ్యర్థులపై ఫీజుల బాదుడు, పేదపిల్లలపై ప్రభుత్వం వ్యాపారమా Information Bulletin (18) do (as notified in District. Selection Committee (DSC) 2018) అభ్యర్థులు తమ అప్లికేషన్ లో తప్పుడు సమాచారము లేదా వివరములు నింపినప్పుడు మాత్రమే వారు క్రొత దరఖాస్తు ఫారం ను సమర్పించవలెనని తెల్పడమైనది

4. స్థానికేతరం ఐచ్చికం ఎంపిక చేస్తే కనిపించని జిల్లాలు జోన్ ల జాబితా

స్థానికేతర అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకున్న సమయంలో స్థానికేతర (open) ఆప్షన్ ఇవ్వబదును అప్పుడు అభ్యర్థులు నమోదు చేసుకొనవచ్చు.

ఉదాహరణకు: అభ్యర్థి కి శ్రీకాకుళం స్థానికత ఉండి కర్నూలుకు స్థానికేతర పోస్ట్ ు (ఓపెన్) అపై చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చును. ఒకసారి అభ్యర్థి తన ఆఫ్గన్ను నమోదు చేసుకున్న తరువాత అభ్యర్థి నియామకము కర్నూలు జిల్లాకే పరిమితం చేయబడును. శ్రీకాకుళం అభ్యర్థిగా పరిగణించబడడు. ఇదే విధంగా జోనల్ పోస్టులకు కూడా ధరఖాస్తుచేసుకోవచ్చును.

5. డి ఎస్సీ వెబ్ సైట్ కు సర్వర్ సమస్య

ఇప్పటివరకు TET 3,17,950 DSC 3,19,176 అప్లికేషన్లు నమోదు చేసుకున్నారు. ఈ ప్రకారం చూస్తే సర్వర్ సమస్య ఉందనడం పూర్తిగా అవాస్తవం. అభ్యర్థులు తన రుసుమును చెల్లించే సమయంలో ఇంటర్నెట్ డిస్కనెక్ట్ కావడం వల్ల గానీ, పూర్ కనెక్షన్ ఉండడం వల్ల గాని పై సమస్య ఉత్పన్నమవుతుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొనుటకు అవకాశం

ఇవ్వడమైనది. ఎవరైనా ఫీజు చెల్లించి జర్నల్ నెంబర్ రాని ఎడల వారు చెల్లించిన రుసుము తిరిగి వారి బ్యాంకు ఖాతాలోనికి ఐదు పని దినములలో జమచేయబడుతుంది.

రోజువారీ ఫీజు చెల్లింపు వివరములు
6. సెంట్రల్ TET వివరాలను నమోదు చెయ్యడంలో సమస్యలు 

కొంతమంది అభ్యర్థులు హెల్స్ డెస్క్ కు కాల్ చేసి సెంట్రల్ TET మార్కులు అడుగుతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వద్ద సెంట్రల్ సిట్ డేటా బేస్ ఉండదు కాబట్టి అభ్యర్థి సీటెట్ పరీక్షకు కేటాయించిన మొత్తం మార్కులు, పొందిన గరిపు మార్కులు తానే నమోదు చెయ్యవలెను. AP TET మాత్రమే అర్హత కలిగిన అభ్యర్థులు వారి హాల్ టిక్కెట్ నెయిర్ ను నమోదుచేస్తే సరిపోతుంది.

7. ఎడిట్ ఆప్షన్ లేకుండా 30,000 మందికి అవస్థలు

దరఖాస్తును నింపే సమయంలో జాగ్రత్త వహించాలని, తప్పులు జరిగితే సవరించుకొనుటకు అవకాశం లేదని అభ్యర్థులకు ఇన్ఫర్మేషన్ బులిటన్ తెలియజేయడం జరిగినది. అభ్యర్థుల సమస్యలను పరిగణలోనికి తీసుకొని, వారికి అప్లికేషన్ ను ఎడిట్ చేసుకుని మరల సమర్పించుటకు అవకాశం ఇవ్వడమైనది.

ఎడిట్ ఆప్షన్ కు పాటించవలసిన సూచనలు : 1. ముందుగా అభ్యర్థులు వెబ్సైట్ నందు డిలీట్ ఆప్షన్ ను ఎంచుకొనవలెను.

2. అభ్యర్థి పాత జర్నల్ (journal) నంబర్ తో మరియు అభ్యర్థి మొబైల్ కు వచ్చు ఓటివ్ (OTP) ని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్ ను పొందవచ్చు. తద్వారా ఎటువంటి రుసుము చెల్లించకుండా తప్పులు సరిదిద్దుకుని అప్లికేషన్ ను మరల సమర్పించుకోవచ్చు. 

8. క్రింది అంశాలలో తప్పులను సవరించుకోవచ్చు

1. అభ్యర్థి యొక్క పేరు అతను సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ అండ్ జిల్లా తప్ప మిగిలిన అంశాలన్నీ మార్చుకొనవచ్చును.

2. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న ఎడల అభ్యర్థి తన పరీక్షా కేంద్రంలో నామినల్ రోల్స్ నందు తన సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకొనవచ్చును. 

9. ఫీజు గడువు పొడిగింపు:

అభ్యర్థుల కోరిక మేరకు అప్లికేషన్ ను ఫీజు తో సహా సమర్పించు గడువు మరో మూడు రోజులు అనగా 25 ఫిబ్రవరి 2024 రాత్రి 12 గంటల వరకు పొడిగించడమైనది. 

10. హెల్ప్ డెస్క్ అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ సమయాలను ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు పాడిగించడమైనది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top