నిరుద్యోగులకు గుడ్ న్యూస్ నల్గొండ జిల్లాలో ఫిబ్రవరి 26న మెగా జాబ్ మేళ

జిల్లా కలెక్టర్ హరిచందన వెల్లడించారు. 100కి పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా ఓ పోస్టర్ను విడుదల చేసింది. స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఫిబ్రవరి 26న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ మెగా జాబ్ మేళా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సెల్ (TFMC), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ మేనేజ్మెంట్ (TASK)
సహకారంతో కోమటిరెడ్డి ప్రతీన్రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎస్సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు తమ సీవీ, అర్హతకు సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకొని రావాలని సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావలసినవారు ఈ క్రింది గ్రూపుల్లో చేరండి...



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top