హోంగార్డుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
విశాఖ సిటీ: హోంగార్డుల నియామకానికి(స్వచ్ఛం ద సేవ) విశాఖకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీ కేటగిరీ (టెక్నికల్, ఇతర ట్రేడ్) కింద చేపట్టే ఈ నియామకంలో ఎంపికైన అభ్యర్థికి రోజుకు రూ.710 డ్యూటీ అలవెన్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 21 నుంచి 50 ఏళ్లలోపు గల డిగ్రీ పూర్తి చేసిన పురుష, మహిళా అభ్యర్థులు అర్హులని వివరించారు. అభ్యర్థులు ఎల్ఎంవీ/హెచ్ఎంవీ డ్రైవింగ్ లైసెన్సు కలిగి అనుభవం ఉండాలన్నారు. బీసీఏ/ఎంబీఏ/ బీఎస్సీ (కంప్యూటర్స్)/బీటెక్(కంప్యూటర్స్) లేదా ఇతర ఐటీ నైపుణ్యం ఉన్న వారికి అదనపు మార్కులు, ప్రాధాన్యత ఉంటుందన్నారు. అభ్య ర్థులు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తును సూర్యాబాగ్ ప్రాంతంలో ఉన్న కమిషనర్ కార్యాలయంలో cp@vrpc.appoice.gov.in కు మెయిల్ చేయవచ్చని సూచించారు. ఫిబ్రవరి 3వ తేదీన దరఖాస్తుల పరిశీలన, 4న ఎంపిక పరీక్ష ఉం టుందని తెలిపారు. ఆ రోజున సూర్యాబాగ్ పోలీస్ స్టేడియంలో నిర్వహించే ఐటీ, డ్రైవింగ్ పరీక్షతో పాటు పురుష అభ్యర్థులు 800 మీటర్లు 200 సెక న్లలో, మహిళలు 300 సెకన్లలో పరుగు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తుల వెరిఫికేష న్కు వచ్చే సమయంలో అభ్యర్థులు తప్పని సరిగా విద్యార్హత, కులం, లైట్/హెవీ డ్రైవింగ్ లైసెన్స్, కం ప్యూటర్ విద్యార్హత పత్రాలు, విశాఖ నేటివిటీ సర్టిఫి కెట్ ఒరిజినల్ పాటు జెరాక్స్లు తీసుకురావాలని సూచించారు.
0 comments:
Post a Comment