UPSC CDSE: యూపీఎస్సీ సీడీఎస్‌ఈ (1) - 2024 నోటిఫికేషన్ విడుదల, త్రివిధ దళాల్లో 457 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రారంభం

COMBINED DEFENCE SERVICES EXAMINATION (I), 2024: కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (CDS) ఎగ్జామినేష‌న్(I)-2024 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) డిసెంబరు 20న విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని 457 ఖాళీలను భర్తీచేస్తారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత ప‌రీక్ష ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబరు 20 నుంచి 2024, జనవరి 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు...

➥ యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2024

మొత్తం ఖాళీలు: 457. 

విభాగాల వారీ ఖాళీలు..

⫸ ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), డెహ్రాడూన్: 100 పోస్టులు

⫸ ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎజిమల: 32 పోస్టులు

⫸ ఎయిర్ ఫోర్స్ అకాడమీ(ఏఎఫ్‌ఏ), హైదరాబాద్: 32 పోస్టులు

⫸ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మెన్): 275 పోస్టులు

⫸ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (ఉమెన్‌): 18 పోస్టులు

అర్హత‌: మిలిటరీ అకాడమీ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. నేవల్ అకాడమీ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎయిర్‌ఫోర్స్ అకాడమీ పోస్టుల భర్తీకి డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. ఇంటర్‌ స్థాయిలో ఫిజిక్స్‌, మ్యాథ‌మెటిక్స్ స‌బ్జెక్టుల‌ు చదివి ఉండాలి. ఓటీఏ ఎస్‌ఎస్‌సీ నాన్‌-టెక్నికల్‌ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. చివరి సంవత్సరం పరీక్షలకు హాజరైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీ పోస్టులకు 25 సంవత్సరాలలోపు ఉండాలి. 02.01.2001 - 01.01.2006 మధ్య జన్మించి ఉండాలి. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి 01.01.2025 నాటికి  20-24 సంవత్సరాల మధ్య ఉండాలి.  02.01.2001 - 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారు రూ.200 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రెండు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్‌ ఇంటెల్లిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ఒక్కో పేపర్‌కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ (ఓటీఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు మ్యాథ్స్‌ పేపర్‌ రాయనవసరం లేదు.

ఇంటర్వ్యూ విధానం: ఇంటర్వ్యూ విభాగానికి 300 మార్కులు కేటాయించారు. కేవలం ఓటీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఇది 200 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో రెండు దశలు ఉంటాయి. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల మెరిట్‌ ప్రాతిపదికన శిక్షణలోకి తీసుకుంటారు.

శిక్షణ వివరాలు: అభ్యర్థులు తమ ప్రాధాన్యం, మెరిట్‌ ప్రకారం ఆర్మీ, నేవీ, ఏయిర్‌ ఫోర్స్‌, ఓటీఏ వీటిలో ఏదో ఒక చోట అవకాశం పొందుతారు. మిలటరీ అకాడెమీకి ఎంపికైనవాళ్లకు ఇండియన్‌ మిలటరీ అకాడమీ దెహ్రాదూన్‌లో శిక్షణ ఉంటుంది. నేవల్‌ అకాడమీలో చేరినవాళ్లకు కేరళలోని ఎజిమాలలో శిక్షణ నిర్వహిస్తారు. ఏయిర్‌ ఫోర్స్‌ అకాడమీకి ఎంపికైనవారికి పైలట్‌ శిక్షణ హైదరాబాద్‌లో ఉంటుంది. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ పోస్టులకు ఎంపికైనవారు చెన్నైలో శిక్షణలో పాల్గొంటారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారికి ఆర్మీ, ఓటీఏలో లెప్టినెంట్‌, నేవీలో సబ్‌ లెప్టినెంట్‌, ఏయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభమవుతుంది. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.

ముఖ్యమైన తేదీలు...

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.12.2023.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.01.2024.

* దరఖాస్తు సవరణ: 10.01.2024 నుంచి 16.01.2024 వరకు

* పరీక్ష తేదీ: 21.04.2024.


Online Application


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top