నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC). ఈ సంస్థ టెక్నీషియన్-బి ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రాసెస్, డిసెంబర్ 31తో ముగుస్తుంది. నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం.
* ఖాళీల వివరాలు
ఈ రిక్రూట్మెంట్ ద్వారా NRSC మొత్తం 54 ఖాళీలను భర్తీ చేస్తుంది. అందులో టెక్నీషియన్-బి(ఎలక్ట్రానిక్ మెకానిక్) 33 పోస్టులు, టెక్నీషియన్-బి(ఎలక్ట్రికల్) 8 పోస్టులు, టెక్నీషియన్-బి(ఇన్స్ట్రూమెంట్ మెకానిక్) 9 పోస్టులు, టెక్నీషియన్-బి(ఫొటోగ్రఫీ)-2 పోస్టులు, టెక్నీషియన్-బి(డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్)-2 పోస్టులు భర్తీ కానున్నాయి.
* వయోపరిమితి
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్..
టెక్నీషియన్-బి(ఎలక్ట్రానిక్ మెకానిక్) పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి. అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(NCVT) నుంచి ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఎన్టీసీ లేదా ఎన్ఏసీ పూర్తిచేసి ఉండాలి. టెక్నీషియన్-బి(ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తుదారులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎన్సీవీటీ నుంచి ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ/ఎన్టీసీ/ఎన్ఏసీ చదివి ఉండాలి. టెక్నీషియన్-బి(ఇన్స్ట్రూమెంట్ మెకానిక్) ఉద్యోగాలకు అయితే అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి. ఎన్సీవీటీ నుంచి ఇన్స్ట్రూమెంట్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ/ఎన్టీసీ/ఎన్ఏసీ చేసి ఉండాలి.
టెక్నీషియన్-బి(ఫొటోగ్రఫీ) పోస్టులకు, దరఖాస్తుదారులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎన్సీవీటీ నుంచి డిజిటల్ ఫొటోగ్రఫీలో ఐటీఐ/ఎన్టీసీ/ఎన్ఏసీ చేసి ఉండాలి.టెక్నీషియన్-బి(డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్) పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కనీసం పదో తరగతి పాసై ఉండాలి. ఎన్సీవీటీ నుంచి డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ ట్రేడ్‌లో ఐటీఐ/ఎన్టీసీ/ఎన్ఏసీ పూర్తిచేసి ఉండాలి.
* అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా NRSC అధికారిక పోర్టల్ https://www.nrsc.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి, 'ఇస్రో రిక్రూట్మెంట్-2023' అనే లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి.
- ఆ తరువాత 'ఆప్లై నౌ' అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
అనంతరం రిజిస్టర్ ఐడీతో లాగిన్ కావాలి. అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేసి అర్హత ఉన్న పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అన్ని వివరాలతో అప్లికేషన్ ఫారమ్ ఫిలప్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, చివరగా ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.
* అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.
* ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష, రెండో దశలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. వీటికి సంబంధించిన షెడ్యూల్‌ను NRSC త్వరలో ప్రకటిస్తుంది
జీతభత్యాలు
ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ. 21,700 నుంచి రూ. 69,100 మధ్య ఉంటుంది. అలవెన్సులు అదనంగా లభిస్తాయి.
0 comments:
Post a Comment