ఇగ్నోలో 102 టైపిస్ట్ & స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

IGNOU Typist And Stenographer Jobs 2023 In Telugu : టైపిస్ట్​, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) 102 జూనియర్​ అసిస్టెంట్​ కమ్ టైపిస్ట్​, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

IGNOU Typist And Stenographer Jobs 2023 : ఇందిరా గాంధీ నేషనల్​ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) 102 జూనియర్​ అసిస్టెంట్​ కమ్ టైపిస్ట్​ (JAT) , స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జూనియర్​ అసిస్టెంట్​ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు

యూఆర్​ - 19 పోస్టులు
ఓబీసీ - 14 పోస్టులు
ఈడబ్ల్యూఎస్​ - 5 పోస్టులు
ఎస్సీ - 8 పోస్టులు
ఎస్టీ - 4 పోస్టులు
మొత్తం పోస్టులు - 50
స్టెనోగ్రాఫర్​ ఉద్యోగాలు

యూఆర్​ - 23 పోస్టులు
ఓబీసీ - 14 పోస్టులు
ఈడబ్ల్యూఎస్​ - 5 పోస్టులు
ఎస్సీ - 7 పోస్టులు
ఎస్టీ - 3 పోస్టులు
మొత్తం పోస్టులు - 52
విద్యార్హతలు

IGNOU Typist And Stenographer Qualifications :

జూనియర్ అసిస్టెంట్​ కమ్​ టైపిస్ట్ :

10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కంప్యూటర్​లో 40 w.p.m వేగంతో ఇంగ్లీష్, 35 w.p.m వేగంతో హిందీ టైప్​ చేయగలగాలి.
Desirable : బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.

స్టెనోగ్రాఫర్​ :

10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కంప్యూటర్​లో 40 w.p.m వేగంతో ఇంగ్లీష్ టైప్​ చేయగలగాలి. 35 w.p.m వేగంతో హిందీ టైప్ చేయగలగాలి.
షార్ట్​ హ్యాండ్​ టెస్ట్​లో 80 w.p.m వేగంతో టైప్ చేయాల్సి ఉంటుంది.
Desirable : బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారికి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయోపరిమితి
IGNOU Typist And Stenographer Age Limit :

2023 డిసెంబర్​ 12 నాటికి జూనియర్​ అసిస్టెంట్​ కమ్ టైపిస్ట్ అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
2023 డిసెంబర్​ 12 నాటికి స్టెనోగ్రాఫర్​ అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు; ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు
IGNOU Typist And Stenographer Application Fee :

యూఆర్​, ఓబీసీ అభ్యర్థులు - రూ.1000
ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు - రూ.600
దివ్యాంగులు - ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం
IGNOU Typist And Stenographer Selection Process : అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. తరువాత స్కిల్ టెస్ట్​/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూ చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
IGNOU Typist And Stenographer Salaries :

జూనియర్​ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్​లకు నెలకు రూ.19,900 - రూ.63,200 చొప్పున జీతం ఉంటుంది.
స్టెనోగ్రాఫర్​లకు నెలకు రూ.25,500 - రూ.81,100 చొప్పున జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం
IGNOU Typist And Stenographer Application Process :

అభ్యర్థులు ముందుగా https://curec.ntaonline.in/ వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
University Recruitment ఆప్షన్​లలో.. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU)ని ఎంచుకోవాలి.
అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలను నమోదు చేయాలి.
మీ ఫొటోగ్రాఫ్ సహా, అవసరమైన పత్రాలు అన్నింటినీ వెబ్​సైట్​లో అప్లోడ్ చేయాలి.
ఆన్​లైన్​లోనే అప్లికేషన్ ఫీజు మొత్తం చెల్లించాలి.
ఎగ్జామినేషన్ సెంటర్​ను కూడా ఎంచుకోవాలి.
వివరాలు అన్నింటినీ మరోసారి చెక్​ చేసుకొని అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు

IGNOU Typist And Stenographer Apply Last Date :

దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 డిసెంబర్​ 1
దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్​ 21
అప్లికేషన్ కరెక్షన్​కు అవకాశం : డిసెంబర్​ 22 నుంచి 25వ తేదీ వరకు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top