ఆంద్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లాలోని మహిళా శిశు సంక్షేమం సాధికారత అధికారి కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత అర్హతగా పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు నవంబర్ 10వ తేదీ లాస్ట్ డేట్ గా నిర్ణయించారు. అభ్యర్థుల వయోపరిమితి 42 ఏళ్లకు మించకూడదు అని పేర్కొన్నారు.
పోస్టుల వివరాలు:
1 జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- 01
2 ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్- 01
3 ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్- 01
4 సామాజిక కార్యకర్త – 01
5 డేటా అనలిస్ట్- 01
6 డాక్టర్ (పార్ట్ టైమ్)- 01
7 అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్- 01
8 అవుట్‌డోచ్ వర్కర్స్- 02
9 మేనేజర్/ కోఆర్డినేటర్ (మహిళలు)- 01
10 సామాజిక కార్యకర్త సాధారణ- బాల్య విద్యావేత్త (మహిళలు)- 01
11 నర్స్ (మహిళలు)- 01
12 ఆయా (మహిళలు)- 06
13 చౌకీదార్ (మహిళలు)- 01
ఈ ఉద్యోగాలకు https://wdcw.ap.gov.in/ వెబ్ సైట్ కి వెళ్లి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు చేసిన ఫామ్ ప్రింట్ తీసి మహిళా, శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా కార్యాలయానికి ఆఫ్ లైన్ లో పంపాలి.
0 comments:
Post a Comment