Health Department Recruitment 2023: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వైద్య సంస్థల్లో 487 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా న్యూఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాల్లోని వైద్య సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో అత్యధికంగా హెల్త్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 70, ఫీల్డ్ వర్కర్ పోస్టులు 140, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు 69, నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 16 ఉన్నాయి. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
రిసెర్చ్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, హెల్త్ ఇన్‌స్పెక్టర్, ఫీల్డ్ వర్కర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లైబ్రరీ క్లర్క్, ఫిజియోథెరపిస్ట్, మెడికల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్స్‌రే టెక్నీషియన్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, యానిమల్ అటెండెంట్, లైబ్రరీ క్లర్క్, నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్స్), పారామెడికల్ వర్కర్, వర్క్‌షాప్ అటెండెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు..
➦ హెల్త్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు మొత్తం 70 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్/ హెల్త్ ఇన్‌స్పెక్టర్/ శానిటరీ హెల్త్ ఇన్‌స్పెక్టర్ డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా పన్నెండో తరగతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్/ హెల్త్ ఇన్‌స్పెక్టర్/ శానిటరీ హెల్త్ ఇన్‌స్పెక్టర్ డిప్లొమాలో పాసై ఉండాలి. అలాగే రెండేళ్ల ఉద్యోగానుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.
➦ ఫీల్డ్ వర్కర్ పోస్టులు మొత్తం 140 వరకు ఉన్నాయి. పదోతరగతి పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 25 ఏళ్లకు మించకుండా ఉండాలి.
➦ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు మొత్తం 69 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి పాసవ్వాలి. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నిక్స్/యానిమల్ కేర్/ల్యాబొరేటరీ యానిమల్ కేర్/ప్రొడక్షన్ ఆఫ్ ఇమ్యునో బయలాజికల్ అండ్ యానిమల్ కేర్/వెటరినరీ ల్యాబొరేటరీ టెక్నాలజీలో ఏడాది ట్రైనింగ్ సర్టిఫికెట్ లేదా ఏడాది డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 27 ఏళ్లకు మించకుండా ఉండాలి.
➦ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 16 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. నర్స్ అండ్ మిడ్‌వైఫ్‌గా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అవ్వాలి లేదా జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ డిప్లొమా చేసి రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో నర్స్ అండ్ మిడ్‌వైఫ్‌గా రిజిస్టర్ అయ్యి ఉండాలి. 50 పడకల హాస్పిటల్‌లో కనీసం ఏడాది పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.
వయోపరిమితి: పోస్టులవారీగా వయోపరిమితి నిర్ణయించారు. కొన్ని పోస్టులకు 25 సంవత్సరాలు, కొన్నిటికి 27 సంవత్సరాలు. మరికొన్నిటికి 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, ఎస్సీ,ఎస్టీలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పది నుంచి 15 సంవత్సరాల మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.600. మహిళలకు, ఎసీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
పరీక్ష విధానం: మొత్తం 240 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. ప్రతిప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ఇక ప్రతి తప్పు సమాధానానికీ 1 మార్కు కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు.
పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ & ఎన్‌సీఆర్, చెన్నె, బెంగళూరు, ముంబయి, లక్నో, రాంచీ, చండీగఢ్, గువహటి, కోల్‌కతా.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తుకు చివరితేదీ: 30.11.2023.
➥ ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01.12.2023.
➥ అడ్మిట్‌కార్డ్ డౌన్‌లోడ్: డిసెంబరు మొదటివారంలో.
➥ కంప్యూటర్ ఆధారిత పరీక్ష: డిసెంబరు రెండోవారంలో.
➥ డాక్యుమెంట్ వెరిఫికేషన్: డిసెంబరు నాలుగోవారంలో.
0 comments:
Post a Comment