AWES Exam: ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయ నియామక పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
AWES Exam Admit Card: దేశంలోని కంటోన్మెంట్లు, ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష హాల్‌టికెట్లను ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నవంబరు 16న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డులను పొందవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా ఆర్మీ స్కూళ్లల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్) ఖాళీలను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
0 comments:
Post a Comment