Sainik School Kodagu: కర్ణాటక రాష్ట్రం సైనిక్ స్కూల్ కొడగు ఒప్పంద ప్రాతిపదికన ఆర్ట్ మాస్టర్, వార్డెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 07 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరకాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 07
ఆర్ట్ మాస్టర్: 01
బ్యాండ్ మాస్టర్: 01
వార్డెన్: 04
పీఈఎం/ పీటీఐ కమ్-మాట్రాన్(ఫీమేల్): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ఆర్ట్ మాస్టర్, బ్యాండ్ మాస్టర్ పోస్టులకు 21-35 సంవత్సరాలు, వార్డెన్, పీఈఎం/ పీటీఐ కమ్-మాట్రాన్ పోస్టులకు 18-50 సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి రాత పరీక్ష/ నైపుణ్య/ ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్ కొడగు చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 20.10.2023
Download Complete Notification
0 comments:
Post a Comment