ఐడీబీఐ బ్యాంకులో 600 అసిస్టెంట్ మేనేజర్ల భర్తీకి సంబంధించి ఆన్లైన్ రాత పరీక్ష కాల్ లెటర్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్/ రోల్ నంబర్, పాస్వర్డ్ వివరాలు నమోదు చేసుకుని కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది పాటు పీజీడీబీఎఫ్ లో శిక్షణ ఇస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్తోతోపాటు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్- ఓ) ఉద్యోగం లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్నం, కడప, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment