మొత్తం ఖాళీలు:3232
ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,282 ఆచార్యుల పోస్టుల భర్తీకి అక్టోబరు 20న ప్రకటన వెలువరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య కె. హేమచంద్రారెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. వీటితో పాటు మరో 70 పోస్టులను డిప్యుటేషన్పై తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడహాక్ ఆచార్యులకు పది శాతం మార్కులు వెయిటేజీ ఇవ్వాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. భర్తీ సమయంలో 1:12 మంది వంతున, వారి నుంచి మళ్లీ 1:4 నిష్పత్తిలో ఎంపిక చేస్తారన్నారు. ఈ ప్రక్రియలో సదరు అధ్యాపకుడు అకడమిక్ సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి సైతం బోధన సిబ్బంది నియామకంలో అనుసరిస్తున్న విధానాన్ని (రేషనలైజేషన్ ప్రక్రియను) అనుసరిస్తామని స్పష్టం చేశారు. ఏ వర్సిటీకి ఎంతమంది బోధనేతర సిబ్బంది అవసరమో లెక్కించి నివేదిక ఇవ్వడానికి ఉర్దూ విశ్వవిద్యాలయం వీసీ రహమాన్తో కమిటీని నియమించామని వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment