Bank Jobs: ప్రముఖ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగాలు..153 పోస్టులకు నోటిఫికేషన్

Bank Jobs: బ్యాంక్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. ఇటీవల వరుసగా బ్యాంక్ నోటిఫికేషన్స్ వెలువడుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (MSC BANK) ట్రైనీ క్లర్క్స్, ట్రైనీ జూనియర్ ఆఫీసర్ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉన్నవారు బ్యాంక్ అధికారిక పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ గడువు అక్టోబర్ 30న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంఎస్‌సీ బ్యాంక్ మొత్తం 153 పోస్టులను భర్తీ చేస్తుంది.

* ఖాళీల వివరాలు

మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రధానంగా ట్రైనీ జూనియర్ ఆఫీసర్స్-45 పోస్టులు, స్టెనో టైపిస్ట్ ఇన్ జూనియర్ ఆఫీసర్ గ్రేడ్-ఒక పోస్ట్, ట్రైనీ క్లర్క్-107 పోస్టులను భర్తీ చేస్తుంది.

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్

ట్రైనీ జూనియర్ ఆఫీసర్స్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థి వయసు 23 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఏదైనా ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. ట్రైనీ క్లర్క్ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థి వయసు 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఏదైనా ఫీల్డ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్టెనో టైపిస్ట్ పోస్టులకు అభ్యర్థి వయసు 23 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ముందు ఆన్ లైన్ రాత పరీక్ష, తర్వాత ఇంటర్వ్యూ, చివరకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. రాత పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఎగ్జామ్‌లో నాలుగు సెక్షన్స్ ఉంటాయి. అభ్యర్థులు 50 శాతం స్కోర్ చేస్తే తరువాత దశకు అర్హత సాధిస్తారు.

అప్లికేషన్ ఫీజు

ట్రైనీ జూనియర్ ఆఫీసర్స్, స్టెనో టైపిస్ట్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటే అప్లికేషన్ ఫీజు రూ.1770 చెల్లించాలి. ట్రైనీ క్లర్క్‌ కోసం అప్లికేషన్ ఫీజు రూ.1180గా నిర్ణయించారు. ఫీజును కేవలం ఆన్‌లైన్‌‌లో మాత్రమే పేమెంట్ చేయాలి.

Higher Education: పిల్లల ఉన్నత విద్య కోసం ప్లాన్ చేస్తున్నారా? ఈ కామన్‌ మిస్టేక్స్‌ అస్సలు చేయకండి

* జీతభత్యాలు

ట్రైనీ జూనియర్ ఆఫీసర్స్ పోస్ట్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.49,000, ట్రైనీ క్లర్క్ రూ.32,000, స్టెనో టైపిస్ట్‌కు రూ.50,415 లభిస్తుంది.

అప్లికేషన్ ప్రాసెస్

- ముందు మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ అధికారిక పోర్టల్ mscbank.com ను ఓపెన్ చేయాలి.

- హోమ్‌పేజీలోకి వెళ్లి, కెరీర్స్ ఆప్షన్ ట్యాప్ చేయాలి. తర్వాత ట్రైనీ క్లర్క్స్, ట్రైనీ జూనియర్ ఆఫీసర్స్, స్టెనో టైపిస్ట్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి.

- నోటిఫికేషన్ వివరాలను పరిశీలించిన తరువాత, ‘అప్లై నౌ’ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

- ముందు వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ నింపాలి.

- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top