మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినీ రత్న కంపెనీగా ఉన్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1140 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అడకమిక్ మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
* ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
ఖాళీల సంఖ్య: 1140
ట్రేడుల వారీగా ఖాళీలు..
➥ ఎలక్ట్రానిక్ మెకానిక్: 30
➥ ఎలక్ట్రీషియన్: 370
➥ ఫిట్టర్: 543
➥ వెల్డర్: 155
➥ మోటార్ మెకానిక్- 47
➥ ఆటో ఎలక్ట్రీషియన్- 12
అర్హత: మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ కోర్సు ఉత్తీర్ణత. ఐటీఐ కోర్సు మధ్యప్రదేశ్/ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 31.08.2023 నాటికి 18 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.
స్టైపెండ్: నెలకు రూ.7700 - రూ.8050.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.10.2023.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.10.2023.
0 comments:
Post a Comment