చెన్నైలోని ఐసీఎంఆర్(ICMR) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వార పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం పోస్టుల సంఖ్య: 47
విభాగాల వారీగా ఇలా..
01 టెక్నికల్ అసిస్టెంట్ 33
02 ల్యాబొరేటరీ అటెండెంట్ 14
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల్లో బయోస్టాటిస్టిక్స్, నెట్‌వర్కింగ్, ప్రోగ్రామర్, ల్యాబొరేటరీ, రిసెర్చ్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్, సోషల్ సైన్స్, పబ్లిక్ హెల్త్, ఫీల్డ్ యాక్టివిటీస్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వంటి విభాగాలున్నాయి. ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాల్లో ల్యాబొరేటరీ, ఎయిర్ కండిషనింగ్, ప్లంబర్, జనరల్ వంటి విభాగాలు ఉన్నాయి.
అర్హతలు.. పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
జీతం.. నెలకు టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.35,400-రూ.1,12,400. ల్యాబొరేటరీ అటెండెంట్‌కు రూ.18,000-56,900 మధ్య జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫీజు రూ.300 చెల్లించాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
Download Complete Notification
0 comments:
Post a Comment