ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహి స్తున్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రిసోర్స్ పర్సన్స్ పోస్టుల భర్తీకి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్షణ ఎస్పీడీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ పో స్టులు 396 ఖాళీగా ఉన్నాయని, ఆసక్తిగలవా రు ఈ నెల 4 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసు కోవచ్చని సూచించారు. ఓపెన్ కేట గిరి అభ్యర్థు లకు 18-42 ఏళ్ల వయసుండాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, మాజీ సైని కోద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపునిచ్చారు. జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు, విద్యార్హత వివరాలను apie. apcfss.in వెబ్సైట్లో ఉంచిన ట్టు తెలిపారు. రూ.100 ఫీజు చెల్లించి ఇదే వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు. సందే హాలుంటే కార్యాలయ పని దినాల్లో ఉదయం 10. నుంచి సాయంత్రం 5.30 వరకు 79933 29117 నంబర్లో సంప్రదించాలని వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment