ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఫిక్స్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల వివరాలు:
1. హ్యాండీమ్యాన్: 971 పోస్టులు
2. యుటిలిటీ ఏజెంట్ (పురుషులు): 20 పోస్టులు
3. యుటిలిటీ ఏజెంట్ (మహిళలు): 07 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 998.
అర్హత: హ్యాండీమ్యాన్- పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్/ హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి. యుటిలిటీ ఏజెంట్- పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు హిందీ భాష పరిజ్ఞానం కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.21,330..
వయో పరిమితి: జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఓబీసీలకు 31 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 33 సంవత్సరాలు
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, పర్సనల్/ వర్చువల్ స్క్రీనింగ్ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.500.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను హెస్ఆర్ డిపార్ట్మెంట్, ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, జీఎస్ఓ కాంప్లెక్స్, సహార్ పోలీస్ స్టేషన్ దగ్గర, సీఎన్ఎంఐ ఎయిర్పోర్ట్, టెర్మినల్-2, గేట్ నం.5, సహర్, అంథేరి ఈస్ట్, ముంబయి చిరునామాకు పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-09-2023.
0 comments:
Post a Comment