Bangalore : బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్.. 2023-24 సంవత్సరానికి అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌లో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1060 ఖాళీలను భర్తీ చేయనుంది. ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, సీవోపీఏ, ఫౌండ్రీ-మ్యాన్, షీట్ మెటల్ వర్కర్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.
ట్రేడ్ అప్రెంటిస్: 1060
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, సీవోపీఏ, ఫౌండ్రీ-మ్యాన్, షీట్ మెటల్ వర్కర్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత: పదోతరగతితో పాటు కర్ణాటక రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఐటీఐల నుంచి క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్(సీటీఎస్)లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పదో తరగతి మార్కులు(70 శాతం వెయిటేజీ), సీటీఎస్ ఐటీఐ పరీక్ష(30 శాతం వెయిటేజీ) మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 31, 2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://hal-india.co.in/
0 comments:
Post a Comment