ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) ప్రొఫెసర్ & ట్యూటర్,క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్(సీఎంవో),సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్), సీఏఎస్ ఆర్ఎంవో, పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 147 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, ఎంసీహెచ్(కన్సెర్న్డ్ స్పెషాలిటీ) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీన వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 147
పోస్టుల వారీగా ఖాళీలు..
⏩ ప్రొఫెసర్: 02
⏩ అసోసియేట్ ప్రొఫెసర్: 04
⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్: 86
⏩ ట్యూటర్: 04
⏩ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్: 10
⏩ సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్): 07
⏩ సీఏఎస్ ఆర్ఎంవో: 02
⏩ సూపర్ స్పెషాలిటీ: 32
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్‌పీఎం, జనరల్ మెడిసిన్, టీబీ&సీడీ, డీవీఎల్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, ఆప్తాల్మాలజీ, ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, రేడియో-డయాగ్నసిస్,అనస్థీషియా, ఎమర్జెన్సీ మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, కార్డియాలజీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, రేడియాలజీ, అనస్థీషియాలజీ, కార్డియో థొరాసిక్ వాస్కులర్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ.
అర్హత: పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, ఎంసీహెచ్(కన్సెర్న్డ్ స్పెషాలిటీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 64 సంవత్సరాల లోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
ఎంపిక విధానం: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 02.08.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10.00 నుంచి సాయంత్రం 4గంటల వరకు.
0 comments:
Post a Comment