న్యూఢిల్లీలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ (సీజీపీడీటీఎం), డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 553 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 04 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 553
* ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స్ గ్రూప్-ఎ (గెజిటెడ్)
విభాగాల వారీగా ఖాళీలు..
⏩ బయో-టెక్నాలజీ: 50
⏩ బయో-కెమిస్ట్రీ: 20
⏩ ఫుడ్ టెక్నాలజీ: 15
⏩ కెమిస్ట్రీ: 56
⏩ పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ: 09
⏩ బయో-మెడికల్ ఇంజినీరింగ్: 53
⏩ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్: 108
⏩ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 29
⏩ కంప్యూటర్ సైన్స్ &ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 63
⏩ ఫిజిక్స్: 30
⏩ సివిల్ ఇంజనీరింగ్: 09
⏩ మెకానికల్ ఇంజినీరింగ్: 99
⏩ మెటలర్జికల్ ఇంజినీరింగ్: 04
⏩ టెక్స్‌టైల్ ఇంజినీరింగ్: 08
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 04.08.2023 నాటికి 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీకి రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04.08.2023.
➥ ప్రిలిమినరీ పరీక్ష: 03.09.2023.
➥ మెయిన్స్ పరీక్ష: 01.10.2023.
➥ మెయిన్స్ ఫలితాల ప్రకటన: 16.10.2023.
0 comments:
Post a Comment