పార్వతీపురం మన్యం జిల్లా యువత కోసం మెగా జాబ్ మేళా ను ఏర్పాటు చేస్తున్నారు జిల్లా అధికారులు. ఈ నెల 21న మన్యం జిల్లా కేంద్రం అయిన పార్వతీపురం శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటలకు జాబ్ మేళా ప్రారంభం కానుంది.
ఈ మేళాలో వివిధ జిల్లాలకు చెందిన 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. సుమారు 1,042 ఉద్యోగాలను ఈ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు.
విజయనగరం, విశాఖపట్నం, తుని, హైదరాబాద్ తదితర ప్రదేశాల్లో ఉన్న మల్టినేషన్ పరిశ్రమల్లో పలురకాల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. వివరాలకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ హెల్ప్ లైన్ 9988853335, లేదా స్కిల్ డెవలప్ మెంట్ హబ్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు 6305110947, భానుప్రసాద్ 6303493720, సురేష్ 7993795796 నెంబర్లకు సంప్రదించాలని ఒక ప్రకటన లో తెలిపారు.
0 comments:
Post a Comment