ముంబయిలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) లీగల్ స్ట్రీమ్‌లో ఆఫీసర్ గ్రేడ్-ఎ(అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 25 పోస్టులను భర్తీ చేయనున్నారు. న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జులై 09 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు
ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్)
మొత్తం ఖాళీలు: 25
అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.05.2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఫేజ్-1, ఫేజ్-2 (పరీక్షలు), ఫేజ్-3 (ఇంటర్వ్యూ) ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.06.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.07.2023.
➥ ఫేజ్-1 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 05.08.2023.
➥ ఫేజ్-2 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 09.09.2023.
0 comments:
Post a Comment