విజయనగరం రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపు ణ్యాభివృద్ధి సంస్థ, టీఏకేటీ ఇంటర్నేషనర్-ఏ పీఎన్ఆర్డీఎస్ ఆధ్వర్యంలో జర్మనీలో స్టాఫ్ నర్స్ (మహిళలు) ఉద్యోగాలకు దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యా భివృద్ధి అధికారి నీలం గోవిందరావు సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసి 20 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు కలిగి, సాధారణ ఆస్పత్రుల లో రెండేళ్ల అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హు లని తెలిపారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసు కున్న అభ్యర్థులు విజయవాడలోని కేఎల్ విశ్వ విద్యాలయంలో 2 నెలల పాటు నిర్వహించే బీ1 స్థాయి జర్మన్ భాష శిక్షణ కోసం ఉచిత తరగతులకు హాజరు కావాలని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థినులకు విమాన చార్జీలు, ఆహారం, వసతి ఆరు నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు పేర్కొ న్నారు. నెలకు 1000 యూరోల జీతం చెల్లిస్తా రన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9988853335, 7730088258 నంబర్లను సం ప్రదించాలని సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
Subscribe My Whatsapp & Telegram Groups
how to apply jermany jobs is there any website?????please let me know.
ReplyDelete