APSFC: ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్‌ మేనేజర్ ఉద్యోగాలు, అర్హతలివే!

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనిద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో సీఏ/ సీఎంఏ లేదా బీఈ, బీటెక్, పీజీడీఎం, డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 20

* అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు..

➥ ఫైనాన్స్: 10

➥ టెక్నికల్: 05

➥ లీగల్: 05

అర్హతలు:సంబంధిత విభాగంలో సీఏ/ సీఎంఏ లేదా బీఈ, బీటెక్, పీజీడీఎం, డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు:జనరల్/ బీసీలకు రూ.590, ఎస్సీ, ఎస్టీలకు రూ.354.

దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం:కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగాఎంపిక ఉంటుంది.

జీతభత్యాలు: నెలకు రూ.35,000.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2023.

➥ ఆన్లైన్ పరీక్ష: జులై- 2023.

Download Notification

Job Notification Whatsapp Group:

Telegram Group:

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top