ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్
. ఈ నెల 23న తాడేపల్లిగూడెంలో మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు:
టెక్ మహీంద్రా, హెటిరో ల్యాబ్స్ తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
TECH Mahindra: ఈ సంస్థలో 125 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు చెన్నైలో పని చేయాల్సి ఉంటుంది. ెంపికైన వారికి నెలకు రూ.12,852 వేతనం ఉంటుంది.
Hetero Labs: ఈ సంస్థలో 250 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ కెమిస్ట్, QA, QC, Jr.Technician, Jr.Officer విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఎస్సీ, ఐటీఐ, డిప్లొమా విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. వేతనం ఏడాదికి రూ.2.1లక్షల నుంచి రూ.2.7లక్షల వరకు వేతనం ఉంటుంది.
Complete Notification: Click Here
0 comments:
Post a Comment