విశ్వభారతిలో.. 709 లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ ఆఫీసర్ కమ్ టైపిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అప్పర్ డివిజన్ క్లర్క్/ఆఫీస్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్/సీనియర్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి రూ.32 నుంచి 57 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు మే 16, 2023వ తేదీ రాత్రి 11:59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.2000, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.500లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.20,200ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ ఆఫీసర్ కమ్ టైపిస్ట్ పోస్టులు: 99
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు: 405
అప్పర్ డివిజన్ క్లర్క్/ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు: 29
సెక్షన్ ఆఫీసర్ పోస్టులు: 4
అసిస్టెంట్/సీనియర్ అసిస్టెంట్ పోస్టులు: 5
ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులు: 6
సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులు: 5
లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు: 6
లైబ్రరీ అటెండెంట్ పోస్టులు: 5
ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు: 1
ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు: 45
అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులు: 1
అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ పోస్టులు: 1
జూనియర్ ఇంజనీర్ సివిల్ పోస్టులు: 9
జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులు: 1
ప్రైవెట్ సెక్రెటరీ పోస్టులు: 7
పర్సనల్ సెక్రెటరీ పోస్టులు: 8
స్టెనోగ్రాఫర్ పోస్టులు: 2
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 2
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 17
సెక్యురిటీ ఇన్స్‌పెక్టర్ పోస్టులు: 1
సీనియర్ సిస్టమ్ అనలిస్ట్ పోస్టులు: 1
సిస్టమ్ ప్రోగ్రామర్ పోస్టులు: 3
రిజిస్ట్రార్ (టెన్యూర్ పోస్టు) పోస్టులు: 1
ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు: 1
లైబ్రేరియన్ పోస్టులు: 1
డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు: 1
ఇంటర్నల్ ఆడిక్ట్ ఆఫీసర్ పోస్టులు: 1
అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు: 6
అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు: 2
Job Notification Whatsapp Group:
Job Notification Telegram Group:
0 comments:
Post a Comment