కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏప్రిల్ 19న విడ
కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2023 నోఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏప్రిల్ 19న విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాల్లో 1261 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలకు కలిగి ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 19 నుంచి మే 9న సాయంత్రం 6. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. యూపీఎస్సీ సీఎంఎస్ పరీక్ష జులై 16న దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో నిర్వహించనున్నారు.
వివరాలు..
* యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023
ఖాళీల సంఖ్య: 1261 పోస్టులు
1) మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్: 584 పోస్టులు
విభాగం: జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్-క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్
2) అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్: 300 పోస్టులు
విభాగం: రైల్వే.
3) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్.
4) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్-2): 376
విభాగం: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.
విద్యార్హత: అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 01.08.2023 నాటికి అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రుసుం రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
పరీక్ష విధానం..
✪ పార్ట్-1లో భాగంగా మొత్తం 500 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరకు 250 మార్కులు. ఒక్కో పేపరులో 120 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.
✪ పేపర్-1లో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ గురించి, పేపర్-2లో సర్జరీ, గైనకాలజీ & అబ్‌స్ట్రేట్రిక్స్, ప్రివెంటివ్ & సోషల్ మెడిసిన్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
✪ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల చొప్పున కోత విధిస్తారు.
✪ పార్ట్-1లో భాగంగా 100 మార్కులకు పర్సనాలిటీ పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు...
➥ నోటిఫికేషన్ వెల్లడి: 19.04.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.04.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.05.2023
➥ సీఎంఎస్ పరీక్ష తేది: 16.07.2023.
Job Notification Whatsapp Group:
Job Notification Telegram Group:
0 comments:
Post a Comment