తెలంగాణలోని గురుకులాల్లో ఖాళీల భర్తీకి సంబంధించిన వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ప్రక్రియ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను గురుకుల నియామక బోర్డు సిద్ధం చేసింది. ఓటీఆర్ నమోదు ద్వారా వచ్చే నంబరుతో నోటిఫికేషన్ల వారీగా అర్హత కలిగిన పోస్టులకు నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. గురుకుల పోస్టులకు ఓటీఆర్ సదుపాయం ఏప్రిల్ 12 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు గురుకుల నియామక బోర్డు టెస్టింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంతో పాటు సాంకేతిక లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. ఓటీఆర్ నమోదు చేస్తేనే పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎక్కువ సమయం వేచిచూడకుండా వెంటనే ఓటీఆర్ నమోదు పూర్తిచేయాలని గురుకుల బోర్డు వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణలోని గురుకులాల్లో ఖాళీల భర్తీకి సంబంధించిన వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ప్రక్రియ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను గురుకుల నియామక బోర్డు సిద్ధం చేసింది. ఓటీఆర్ నమోదు ద్వారా వచ్చే నంబరుతో నోటిఫికేషన్ల వారీగా అర్హత కలిగిన పోస్టులకు నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. గురుకుల పోస్టులకు ఓటీఆర్ సదుపాయం ఏప్రిల్ 12 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు గురుకుల నియామక బోర్డు టెస్టింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంతో పాటు సాంకేతిక లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. ఓటీఆర్ నమోదు చేస్తేనే పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎక్కువ సమయం వేచిచూడకుండా వెంటనే ఓటీఆర్ నమోదు పూర్తిచేయాలని గురుకుల బోర్డు వర్గాలు వెల్లడించాయి.i
అందుకే ఓటీఆర్ విధానం...
ఉపాధ్యాయ బోధన విద్యార్హత కలిగిన అభ్యర్థులకు తాము చదివిన డిగ్రీ, పీజీ కోర్సుల మేరకు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులు బోధించేందుకు అర్హత కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రతిపోస్టుకు దరఖాస్తు చేసేందుకు వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సి రావడం, తప్పులు దొర్లితే సవరణలకు బోర్డు కార్యాలయం చుట్టూ తిరగాల్సి రావడం లాంటి సమస్యల్ని అధిగమించడానికి.. దరఖాస్తు ప్రక్రియను సరళం చేసేందుకు బోర్డు ఓటీఆర్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఓటీఆర్‌లో రిజిస్టరు అయిన తరువాత రిజిస్ట్రేషన్ నంబరుతో విద్యార్హతల మేరకు బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్లలో సబ్జెక్టుల వారీగా నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలవుతుంది.
గతంలో మాదిరిగానే ఫీజులు...
గురుకుల నియామక బోర్డు నిర్వహించే పరీక్ష ఫీజులు పెంచడం లేదని ఇప్పటికే బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. గతంలో మాదిరిగానే ఫీజులు ఉంటాయని వెల్లడించాయి. గత ఉద్యోగ ప్రకటనల సమయంలో దరఖాస్తు ఫీజు రూ.1,200గా, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.600గా నిర్ణయించారు. ఒక్కో అభ్యర్థి రెండు.. అంతకన్నా ఎక్కువ పోస్టులకు అర్హతలు కలిగి ఉంటున్నారు. ఈ లెక్కన అభ్యర్థి పరీక్ష ఫీజు కింద భారీగా చెల్లించాల్సి వస్తోంది. రెండు టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేయాలన్నా సాధారణ అభ్యర్థులు రూ.2,400వరకు, రిజర్వుడు అభ్యర్థులు రూ.1,200 చెల్లించాల్సి వస్తోంది. బోర్డులు వసూలు చేస్తున్న ఫీజులు ఎక్కువగా ఉండటంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ వసూలు చేస్తున్న ఫీజులు తక్కువగా ఉంటున్నాయి. కమిషన్ ఒక్కో నోటిఫికేషన్‌కు రూ.200 దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది. పరీక్ష ఫీజు రూ.120గా నిర్ణయించినప్పటికీ తెలంగాణ నిరుద్యోగులు, రిజర్వుడు వర్గాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. కానీ గురుకుల బోర్డు ఫీజులు ఎక్కువగా ఉన్నాయని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. గురుకుల నియామక ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
దరఖాస్తు తేదీలివే..
గురుకుల జూనియర్ కాలేజీల్లో పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు, పీజీటీ పోస్టులకు ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు, మిగతా పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు తేదీలివే.

0 comments:
Post a Comment