2022-23 సంవత్సరానికి సంబందించి విభిన్న ప్రతిభావంతులు (వికలాంగులు) కొరకు గ్రూప్-4 సర్వీసులో కేటాయించబడి భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న టైపిస్ట్-1, లైబ్రరియన్ గ్రేడ్ - III-2 మరియు నాల్గవ తరగతి శ్రేణి నందు : కామాటి-3, పి.హెచ్ వర్కర్ - 2, కుక్ -1 మరియు ఫిట్టర్ కూలి-1 పోస్టులకు గాను మొత్తం 10 పోస్టుల నిల్వ ఖాళీల భర్తీ కొరకు విడివిడిగా ధరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ అవకాశాన్ని జిల్లాల విభజనకు ముందు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కు (Erstwhile SPSR Nellore District) చెందిన అర్హులైన విచిన్న ప్రతిభావంతులు వినియోగించుకోవచ్చును. ఈ బ్యాక్ లాగ్ ఉద్యోగాలకు సంబందించి దరఖాస్తు చేయు విధానము: మరియు నోటిఫికేషన్ యొక్క సూచనలు https://spsnellore.ap.gov.in వెబ్ సైట్ లో notice-category/recruitment/ అను టాబ్ https://www.spsrsrdrecruitment.com నందు పొందుపరచబడియున్నది. కావున అభ్యర్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తేదీ: 18-04-2023 సాయంత్రం 05:00 గంటల లోగా ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకొని ఆ యొక్క దరఖాస్తు ప్రతిని అదే తేదీ లోపల నెల్లూరు నగరం, కొండయపాలెం రోడ్ వనంతోపు లో గల విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ కార్యాలయములో సమర్పించాలని ఏదైనా సందేహ నివృత్తి కొరకు కొరకు కార్యాలయ ఫోన్ సెంటర్ 0861-2329581 ను పని వేళలలో మరియు పని దినములలో సంప్రదించగలరని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలనుసారం శాఖ సహాయ సంచాలకులు శ్రీ మతి వి. నాగరాజ -కుమారి గారు ఒక ప్రకటనలో తెలియజేసియున్నారు.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ ల
కోసం క్రింది వాట్స్అప్ గ్రూప్‌లో చేరండి:
0 comments:
Post a Comment