JEE Main Admit Card: జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 అడ్మిట్ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2023 సెషన్-2కు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయిమార్చి 6 నుంచి జరగనున్న ఈ పరీక్షలకు అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం (ఏప్రిల్ 3న) సాయంత్రం విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లలో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. 

దేశవ్యాప్తంగా 330 సిటీల్లో ఏప్రిల్ 6,8,10,11,12,13, 15 తేదీల్లో జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అలాగే, విదేశాల్లోని 15 నగరాల్లోనూ ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు మొత్తం 9.4 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్(సెషన్-2) అడ్మిట్ కార్డు డౌన్లోడ్లో ఏమైనా సమస్యలు ఎదురైతే విద్యార్థులు హెల్ప్లైన్ నంబర్- 011-40759000 లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు. మరోవైపు, జేఈఈ మెయిన్లో టాప్స్కోరు సాధించే 2,50,000 మంది విద్యార్థులు జూన్ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top